అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన పే టకు చెందిన ప్రజ్ఞ శ్రీ.

నమస్తే న్యూస్ నారాయణఖేడ్ డివిజన్ రిపోర్టర్ పెద్ద శంకరంపేట, తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన 2025 26 అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు చెందిన బి ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఆగస్టు 30వ తేదీన అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం బిఎస్సి అగ్రికల్చర్ (అగ్రిసెట్ ). ఫలితాలు విడుదల చేయడం తో పెద్ద శంకరంపేటకు చెందిన ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు ఆమెను అభినందించారు. తన తల్లిదండ్రులు పల్లవి శంకర్ గౌడ్
తోపాటు సోదరీమణుల ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక కాలనీవాసులు గ్రామస్తులు ప్రజ్ఞ శ్రీ ని అభినందించారు.

Latest News