ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 3డీ యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుని సత్తా చాటుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. ఇప్పుడు అనేక రికార్డులు కొల్లగొడుతోంది. అయితే కన్నడ సినీ ఇండస్ట్రీ నిర్మించిన ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదరగొడుతోంది.
ఇప్పుడు టాలీవుడ్ లో కూడా యానిమేషన్ చిత్రాల సందడి మొదలైంది. ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 3డీ యానిమేషన్ వాయుపుత్ర సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ మంత్ ను కూడా అనౌన్స్ చేసింది. % శ్రీంశీ =మున% – మెగా గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఆ సినిమాను చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. డివోషనల్ జోనర్ లో కార్తికేయ మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు వాయుపుత్ర మూవీ చేస్తుండడం విశేషం.
2026 దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది చిత్రం. అయితే వాయుపుత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. ఓ రేంజ్ లో అందరినీ
ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న పవర్ ఫుల్ పోస్టర్.. సినిమా ద్వారా మేకర్స్ అందించాలనుకుంటున్న ఇతిహాస స్థాయి, ఆధ్యాత్మిక లోతును ఆడియన్స్ కు క్లియర్ గా అర్థమయ్యేలా చెబుతోంది.
















