సూర్యకుమార్ యాదవ్పై నెటిజన్లు ప్రశంసలు

ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలు, ఆటతీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శభాష్ సూరీడు మాట నిలబెట్టుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొడియాడుతున్నారు. ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణ వికె ట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు.

ఎందుకంటే గత ఏడాది టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన చేసినా, శు భీమన్ గిల్ తిరిగి వైస్ కెప్టెన్ గా జట్టులో చేరడంతో సంజూ స్థానంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గిల్ గైర్హాజరీలో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ, పది ఇన్నింగ్స్లో మూడు శతకాలతో తన సత్తా చాటాడు. కానీ గిల్ రాకతో సంజూ ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కుతుందా లేదా అన్న ప్రశ్న అభిమానులను కలవరపెట్టింది. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే లాంటి సీనియర్ ఆట గాళ్లు ఉండగా, ఫినిషర్గా జితేష్ శర్మకు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావించారు.

ముఖ్యంగా ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ విజయంలో జితేష్ కీలక పాత్ర పోషించడం అతనికి అదనపు బలం ఇచ్చింది. దీంతో సంజూ మరోసారి బెంచ్క పరిమితమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టమైన న సమాధానం ఇచ్చాడు. సంజూ శాంసన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతనికి తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. అలాగే తుది జట్టు ఎంపికలో న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని హింట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే, యూఏఈతో తొలి మ్యాచ్లో సంజూని ప్లేయింగ్ ఎలెవన్లో కి తీసుకోవడం ద్వారా సూర్య తన మాట నిలబెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు
సూర్యను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కెప్టెన్ కూల్, సంజూ పై నమ్మకం చూపిన నిజమైన నాయకుడు అం టూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరో వైపు కొందరు అభిమానులు, శుభమన్ గిల్ కోసం సంజూకు అన్యాయం చేయకూడదని సూచిస్తున్నారు. సంజూను ఓపెనర్ కొనసాగిస్తేనే అతని ఆటతీరు మరింత
మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

Latest News