సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు

అనంతపురం, సెప్టెంబర్ 10:

2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సభ రాజకీయాలు, ఓట్లు కోసం
కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టున్నామని 201
సభను ఏర్పాటు చేసినట్లు సీఎం
పేర్కొన్నారు. సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని చెప్పేందు తాము అనంతపురానికి వచ్చామన్నారు. సూపర్ సిక్స్ పథకాల ను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని.. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అని అభివర్ణించారు.

57 శాతం మంది ప్రజలు ఓట్లేశారని.. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని.. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హెూదా కూడా లేకుండా చేశారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిందన్నారు. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో

రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన పెట్టుబడులను తరిమేసి.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం దాదాపు 93 పథకాలను నిలిపి వేసిందని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ గా హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారన్నారు. పెన్షన్ల, సూపర్ సిక్స్పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా అంటూ ప్రజలను ఈ సందర్భంగా
సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

సూపర్ సిక్స్ అంటే హేళన చేశారన్నారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యమని పేర్కొన్నా రన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. మెగా డీఎస్సీ అవ్వదన్నారు… దీపం వెలగదన్నారు… ఫ్రీ బస్సు కదలదన్నారంటూ గత వైసీపీలోని పెద్దలు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని తెలిపారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు,

ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని.. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేశ్కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని సీఎం చంద్రబాబు వివరించారు.

Latest News