Author: admin

  • ప్రధాని  మోడీకి పాలాభిషేకం

    ప్రధాని మోడీకి పాలాభిషేకం

    కంచి మహేందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీకి పాలాభిషేకం
    ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

    కుకట్ పల్లి/నమస్తే న్యూస్(మేడ్చల్ డిస్టిక్)ఫతేనగర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు కంచి మహేందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీకి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ సందర్భంగా కంచి మహేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశ ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుంది అని సాధారణ కుటుంబాల జీవన వ్యయాన్ని తగ్గించడమే కాకుండా వ్యాపారులకు, రైతులకు కూడ ఊరటనిస్తుంది అని తెలియజేశారు. ప్రజల హితాన్ని కోరే ప్రధానమంత్రి మోడీ సేవలు ఎల్లప్పుడూ పేదలకు అనుకూలంగా ఉంటుందని తెలియజేసారు. దేశంలో పేదలు అనుభవిస్తున్న ఆర్థిక బాధలను చూసి కేంద్రం భారీ స్థాయిలో జిఎస్టి తగ్గుదల చేయడం తో సామాన్యులకు భారీ స్థాయిలో మేలు జరగడంతో ఫతేనగర్ డివిజన్ బిజెపి శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకొని మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి, కూకట్ పల్లి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ జిఎస్టి 28 శాతం 12 శాతం స్లాబులతో ఉండడంతో ముఖ్యంగా పేద ప్రజలుపై పడుతున్న అర్థిక భారం పడుతున్న విషయాన్ని గ్రహించి 5% చేయడంతో పేద ప్రజలపై భారీగా భారం తగినట్లు అయింది. దీనితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కంచి మహేందర్ పిలుపుమేరకు భారీ స్థాయిలో బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
    . ఈ కార్యక్రమంలో ఫతేనగర్ బిజెపి నాయకులు రఘు యాదవ్, సతీష్ గౌడ్, బానిష్, రఘు, శివ, ఉషారాణి, మహాలక్ష్మి, అశోక్, వినీత్ యాదవ్, బత్తి రమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

  • DR Y.S. RAJASEKHAR REDDY MEMORIAL AWARD 2025

    DR Y.S. RAJASEKHAR REDDY MEMORIAL AWARD 2025

    ఉచిత విద్యుత్ అంటే – వైఎస్
    ఆరోగ్యశ్రీ అన్నా.. వైఎస్సే…

    ఎవ్వరు కూడా రద్దు చేయని పథకాలు అవి వైఎస్ బాటలోనే తానూ ముందుకు వెళుతున్నా వైఎస్ కలలుకన్న ప్రాణహిత చేపట్టి పూర్తి చేస్తాం వైఎస్సార్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో రేవంత్
    సేంద్రియ వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్కు అవార్డు అందచేత

    రైతులకు ఉచితవిద్యుత్ అందించా లన్న సంకల్పంతో దానిని అమలు చేయడం మాజీ సీఎం దివంగత వైఎస్సార్
    ద్వారా చెరగని ముద్ర వేశారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భవిష్యత్తులోనూ ఎవరూ రద్దు చేయలేని పథకాలను వైఎస్సార్ అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను రద్దు చేసే ఎవరికీ లేదు.

    ఆయన స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో నిర్వహించిన వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్ర మంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. సుభాష్ పాలేకర్కు

  • కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు సభ.. సోమవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

    కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు సభ.. సోమవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

    బీసీలకు 42 శాతం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ కామరెడ్డి డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు హామి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్​కు పంపడం, కేసీఆర్​ హాయాంలో తీసుకువచ్చిన 50 శాతానికి లోబడి రిజర్వేషన్ల చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్​చేసి గవర్నర్​కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపడం అక్కడ అవి పెండింగ్ లో ఉండటంతో ఆర్డినెన్స్​ను బిల్లుగా మార్చి తాజాగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్​కు ప్రభుత్వం పంపింది. ఆ బిల్లు ప్రస్తుతం గవర్నర్​దగ్గర ఉంది. బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అవుతుంది. మళ్ళీ బిల్లు పెండింగ్ లో పడితే పార్టీ పరంగా 42 శాతం ఇచ్చేందుకు కాంగ్రెస్​సిద్దమైంది.

  • ecis crucial meeting with state ceos on september

    ecis crucial meeting with state ceos on september

    బిహార్ లో అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ప్రక్రియపై రాజకీయ పక్షాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులు (సీఈవో)లతో ఈసీ భేటీ కాబోతున్నది. ఇది రెగ్యులర్ మీటింగ్ అని ఈ సమావేశంలో ఎస్ఐఆర్ తో పాటు గత సమావేశాల మాదిరిగానే అన్ని అంశాలపై చర్చించబోతున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.

    ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం!:

    ఓట్ చోరీ అంశంలో ప్రతిపక్షాలు ఈసీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈసీ- బీజేపీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను చోరీ చేస్తోందని రాహుల్ గాంధీ నేరుగా ఎటాక్ చేస్తున్నారు. బిహార్ లో ఎస్ఐఆర్ కూడా ఇందులో భాగమేనని వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఈసీ.. బిహార్ లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోంది. అయితే ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చేపట్టాలని గత జూలైలోనే ఈసీ నిర్ణయం తీసుకుంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన జరగబోయే సమావేశంలో ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.