Author: admin

  • ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

    ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

    నమస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సెప్టెంబర్ 15 పూడూరు మండల పరిధిలో తూర్కు ఎంకేపల్లి గ్రామంలో గుంతపల్లి సాయికుమార్ వయసు 27 సంవత్సరాలు అతనికి పెళ్లి అయింది ఒక నెల పాప ఉన్నది కానీ వాటన్నిటిని ఆలోచన చేయకుండా ఫైనాన్స్ వేధింపులకు తట్టుకోలేక ఇలాంటి త్మహత్య నిర్ణయం తీసుకోవడం జరిగింది అతను గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఎయిర్పోర్ట్తో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు..

    అనుకోకుండా మళ్ళీ ఒక బండి చోళ మండల్ ఫైనాన్స్ షోరూం బండి తీసుకోవడం ఫైనాన్స్ చెల్లింపు విషయంలో ఫైనాన్సర్కు ఆయనకు మాటల ఘర్షణలు జరిగిన తర్వాత ఫైనాన్సర్ అతనిపై చాలా తీవ్రంగా వేధింపు చేయడం జరిగింది. ఇట్టి విషయమై కుటుంబ సభ్యులకు ఆరోపించాడు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో అతను మనస్థాపనకు గురై శుక్రవారం నాడు శంషాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    సమాచారం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. స్థానికులు కుటుంబ సభ్యులు ఫైనాన్స్ సంస్థల వేధింపులు మితిమీరడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్రం వ్యక్తం చేశారు.

  • వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న చంద్రబాబు మనవడు నారా దేవాన్షి

    వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న చంద్రబాబు మనవడు నారా దేవాన్షి


    అమరావతి సెప్టెంబర్ 14: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్షా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను అందుకున్నారు. లండన్లో వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన అవార్డుల వేడుకలో దేవాన్న్ కు అవార్డును ప్రదానం చేశారు. వేగవంతంగా చెక్మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన సందర్భంగా అవార్డు దక్కింది. ఈ ముఖ్యమంత్రి

    చంద్రబాబుసందర్భంగానాయుడుదేవాన్స్కుతెలిపారు.మార్గనిర్దేశంలోఅభినందనలుగురువుల నెలలపాటుకష్టపడి ఈ ఘనతసాధించాడనిపేర్కొన్నారు. 175 పజిల్స్లోలో ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ రికార్డుపట్లగర్విస్తున్నానని అన్నారు. నారా దేవాన్షి తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ 10 ఏళ్లవయసులోనే ఆలోచనలకు పదను పెడుతూ,ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాన్షి చెస్ నేర్చుకున్నాడని తెలిపారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని అన్నారు. నారా దేవాన్షా గతంలోనూ చెస్ డొమైన్లో రెండు రికార్డులు సాధించారు.

  • సైన్యాన్ని ఛీకొట్టి.. జాతి వ్యతిరేకులకు జై కొట్టే కంగాళి కాంగ్రెస్: మోడీ

    సైన్యాన్ని ఛీకొట్టి.. జాతి వ్యతిరేకులకు జై కొట్టే కంగాళి కాంగ్రెస్: మోడీ

    అసోం పర్యటనలో బహిరంగ సభలో ఉతికేసిన ప్రధాని అంగుళం భూమి కబ్జా కాకుండా చేసి తీరుతాం అసామీ భూమిపుత్రులను గేలిచేయడం అనుచితం డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈశాన్యానికి దక్కిన మేలు
    మంగళడోయ్, సెప్టెంబర్ 14: కాంగ్రెస్ పార్టీ భారతీయ సైన్యానికి మద్దతు పలకడం మానివేసి, పాక్ ఉగ్రవాదులకు జై కొడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఆదివారం అసోంలోని దార్రాంగ్ జిల్లాలోని మంగళ్ డోయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరి విచిత్రంగా ఉంటోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ పెంచిపోషిస్తోన్న.

  • ఆసియా కప్లో పాకిస్తాన్ప తొలిసారి ఆడనున్న ఐదుగురు భారత ఆటగాళ్లు

    ఆసియా కప్లో పాకిస్తాన్ప తొలిసారి ఆడనున్న ఐదుగురు భారత ఆటగాళ్లు

    ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్తో భారతదేశం పాల్గొనడంపై సందేహాలు తలెత్తడంతో, ఆసియా కప్ 2025 అనిశ్చితిని ఎదుర్కొంది. చివరికి, భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిమానులు ఈ పోరును చూడబోతున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇంకా టీమ్ ఇండియాను ప్రకటించలేదు. భారత జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు, వీరు పాకిస్తాన్తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

    సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్లో ఈ ఆటగాళ్లకు పాకిస్తాన్తో ఆడే అవకాశం లభించవచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య 2012-13 నుంచి ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు అంతర్జాతీయ, ఆసియా ఈవెంట్స్ మాత్రమే జరుగుతాయి. దీని కారణంగా, భారత జట్టులో చేరిన యువ ఆటగాళ్లు ఇప్పటివరకు పాకిస్తాన్తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఆటగాళ్లలో భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్, జితేశ్ శర్మ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు తిలక్ వర్మ, రింకు సింగ్ కూడా పాకిస్తాన్ తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

    భారతదేశానికి చెందిన ఈ ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురికి ఆసియా కప్ మొదటి మ్యాచ్లో అవకాశం లభించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ యూఏఈతో జరిగిన ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో ఉన్నారు. ఒకవేళ టీమ్ ఇండియా పాకిస్తాన్గిల్, కుల్దీప్ యాదవ్జరిగే ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోతే, ఈ ఆటగాళ్లు పాకిస్తాన్తో తమ కెరీర్లో తొలి మ్యాచ్ ఆడతారు. అదే సమయంలో రింకు సింగ్, జితేశ్ శర్మలు వేచి చూడాల్సి ఉంటుంది.

    పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ను సెప్టెంబర్ 14న మ్యాచ్ కు ముందే ప్రకటించవచ్చు. ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. అదే సమయంలో భారత జట్టులో శుభమన్ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు, వీరు పాకిస్తాన్తో %హణ × % మ్యాచ్ లు ఆడారు, కానీ టీ20లో ఇంతకు ముందు పాకిస్తాన్తో ఎప్పుడూ ఆడలేదు. సెప్టెంబర్ 14న గిల్, కుల్దీప్ పాకిస్తాన్తో తొలి టీ20 మ్యాచ్ ఆడవచ్చు. భారత స్పిన్నర్లు, ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు ఇబ్బంది పెడతారని వసీం అక్రమ్ హెచ్చరిస్తున్నారు.

    “పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ భారత స్పిన్నర్లతో ఇబ్బంది పడుతుంది. జస్రీత్ బుమ్రాను భయంకరంగా కనిపించవచ్చు కానీ, కానీ వరుణ్, కుల్దీప్ వంటి వారు బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. బంతి పిచ్ అయిన తర్వాత ఒక బ్యాటర్ బంతిని రీడ్ చేస్తున్నాడంటే ఏమి జరుగుతుందో తెలియదని అర్థం” అని చెప్పారు. పాకిస్తాన్ లాగానే భారతదేశం కూడా 2025 ఆసియా కప్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ, ప్రత్యర్థి బ్యాట్స్మన్కు కుల్దీప్ యాదవ్ ఎంత ఇబ్బందికరంగా ఉంటాడో చూపించడానికి ఇది సరిపోతుంది. భారత 11 ఇదే కావచ్చు:

    అభిషేక్ శర్మ – ఓపెనర్, శుభ్ మన్ గిల్ – ఓపెనర్, తిలక్ వర్మ – బ్యాటర్, సూర్యకుమార్ యాదవ్ – బ్యాటర్, సంజు సామ్సన్ కీపర్-బ్యాటర్, హార్దిక్ పాండ్యా – ఆల్ రౌండర్, శివమ్ దూబే ఆల్ రౌండర్, అక్షర్ పటేల్ – స్పిన్నర్, వరుణ్ చక్రవర్తి – స్పిన్నర్, కుల్దీప్ యాదవ్ – స్పిన్నర్, జస్ప్రీత్ బుమ్రా – పేసర్. బెంచ్: అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, జితేష్ శర్మ.

  • ఏపీలో 14 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ కడప జిల్లా ఎస్పీగా నచికేత్

    ఏపీలో 14 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ కడప జిల్లా ఎస్పీగా నచికేత్

    అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 14 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ఐపీఎస్లను బదిలీ చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ ను నియమించారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్ల, తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు,అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలి, కడప జిల్లా ఎస్పీగా నచికేత్, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్, విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, పల్నాడు జిల్లా ఎస్పీగా డి. కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్దన్ రాజు, చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ను నియమించారు.

  • సినిమాలు చేసేందుకు కాదు మీకు ప్రజలు ఓట్లేసింది.

    సినిమాలు చేసేందుకు కాదు మీకు ప్రజలు ఓట్లేసింది.

    అమరావతి :సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు.. సూపర్ ప్లాప్ అని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా ఆరోపించారు. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో కూటమి నేతలు చేసిన స్కిట్ను ప్రజలందరూ చూశారని తెలిపారు.

    చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండేళ్ల రాష్ట్ర సంపదను దోచుకుని ప్రజలకు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కూటమికి ఎందుకు ఓట్లు వేశామా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని ఆర్కే రోజా విమర్శించారు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాలని చంద్రబాబు అనుకున్నారా అని ప్రశ్నించారు. అదే జగన్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలిపారు.

    ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని చూశారన్నారు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. షూటింగ్లు చేసుకోవడానికి కాదు మీకు ఓటేసిందిషూటింగ్లు చేసుకోవడానికి కాదు పవన్ కల్యాణ్కు ప్రజలు ఓట్లు వేసిందని ఆర్కే రోజా విమర్శించారు. ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి కాదు పవన్కు ఓట్లు వేసిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను జనసేన అధినేత పట్టించుకోకుండా ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారని విమర్శించారు.

    బుర్ర ఉన్న వెదవ ఎవరూ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వరని.. కానీ పవన్కల్యాణ్ మాత్రం తల ఆడించారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్కు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు. అది ప్రజెంటేషన్ కాదు.. ఫ్రస్ట్రేషన్ ూంమంత్రి అనిత మెడికల్ కాలేజీల విషయంలో చూపించింది ప్రజెంటేషన్ కాదు.. ఫ్రస్ట్రేషన్ అని రోజా విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు మెడికల్ కాలేజీల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్లుగా మంత్రి సవిత తీరు ఉందని ఎద్దేవా చేశారు. మొదటి సారి ఎమ్మెల్యే, మంత్రి అయినప్పటికీ..

    తమప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవడం చేతకావడం లేదని విమర్శించారు. నేను రాజమండ్రి, విజయనగరం, పాడేరు, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల దగ్గరకు వస్తాను.. దమ్ముంటే మంత్రులు అక్కడికి రావాలని సవాలు విసిరారు. వైఎస్ జగన్ పూర్తి చేసిన కాలేజీలను చూపిస్తానని తెలిపారు. ఓడిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు అబద్దాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని రోజా విమర్శించారు.

    చంద్రబాబుకు విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉందని చెప్పుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలోకావాలంటే ఏడేళ్ల సమయం పడుతుందని.. ఎయిమ్స్ పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టిందని తెలిపారు. మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయనే కనీస అవగాహన కూడా మంత్రులకు లేదని విమర్శించారు. కొవిడ్ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసని అన్నారు

    . కొవిడ్ సమయంలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేశ్ మెప్పు పొందడం కోసం మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ బెంగళూరులో ఉంటే.. ఓడిపోయినప్పుడు టీడీపీ, జనసేన ఎక్కడ ఉన్నారని నిలదీశారు.

  • సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి

    సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి


    ఇల్లెందు, సెప్టెంబర్ 13 :

    గ్రూపు-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్పీ ఇల్లెందు నియోజకవర్గ విద్యార్థి విభాగ నాయకుడు కాసాని హరిప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉద్యోగం సాధించాలనే తెలంగాణ నిరుద్యోగ యువత ఆశలపై టీజీపీఎస్సీ నీళు చల్లిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎఎస్పీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్,

    ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు శనివారం జెకె కాలనీలో గల గ్రంథాలయం వద్ద బీఆర్ఎస్పి నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ అవకతవకలకు పాల్పడిందన్నారు. కేవలం రెండు సెంటర్ల నుండే 74 మంది ర్యాంకర్లు ఉండటం పట్ల అనేక అనుమానాలకు తావు ఇస్తుందని, ఇప్పటికీ ఈ విషయంలో హైకోర్టుకు టీజీపీఎస్సీ వివరణ ఇవ్వకపోవడం అనేక అవకతవకలు జరిగాయని అర్థం అవుతుందన్నారు.

    ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన కుట్ర అని, దీని వెనక చాలా మంది పెద్దల హస్తం ఉందన్నారు. గతంలో ఆరు నెలల క్రితమే గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, అనేక కోట్ల రూపాయల వ్యాపారంతో గ్రూపు వన్ అభ్యర్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల కష్టంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి బేషజాలకు వెళ్లకుండా పరీక్షను తిరిగి నిర్వహించాలని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు భూక్య సురేశ్, నెమలి నిఖిల్, ఇంతియాజ్, వైకుంఠం, బిపిన్ నాయక్, ఎస్.కె చాంద్ పాషా, గండమల్ల రామకృష్ణ, గౌస్ పాషా, సోను, కిరణ్, కొండ్రు. రవికాంత్, ఎస్కే. వలి, ఎస్కే. సమీర్, ఎస్కే. సఫిక్, ఎస్కే. సోహెల్ పాల్గొన్నారు.

  • భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం అధికారులు అలర్ట్

    భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం అధికారులు అలర్ట్

    హైదరాబాద్, సెప్టెంబరు 13: తెలంగాణతో పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఉస్మాన్ సాగర్,
    హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు వస్తోంది. మూసీకి కూడా బారీ స్థాయిలో వరదనీరు చేరడంతో భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ వరద ప్రవాహం
    ప్రమాదకర స్థాయిలో ఉంది. ఉస్మాన్ సాగర్,

    హిమాయత్ సాగర్ 10 గేట్లు ఎత్తి 8300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు అధికారులు. ఈ క్రమంలో ముందస్తుగా నార్సింగ్ సర్వీస్ రోడ్డు, ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ క్రమంలో మంచిరేవుల – నార్సింగ్కు రాకపోకలు బంద్ చేశారు.మంచిరేవుల బ్రిడ్జిపై నుంచి కూడా మూసీ వరద ప్రవహిస్తోండటంతో జియాగూడ, పురానాపుల్ మధ్య రాకపోకలు మూసివేశారు. అలాగే, జియాగూడ 100 ఫీట్ రోడ్డు పైకి వరదనీరు చేరింది. పురానాపూల్, హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు.

  • ప్రజలే ఫస్ట్ : నూతన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

    ప్రజలే ఫస్ట్ : నూతన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

    పల్నాడు జిల్లా ప్రతినిధి:- ప్రజలు, ప్రజా ప్రయోజనాలే ఫస్ట్ అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా కృతిక శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేసి, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 2016-18 కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా పల్నాడుప్రాంతంలో విరివిగా

    చేసినపర్యటనలుతనకుఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కృతిక శుక్లా ఐఏఎస్ గతంలో నిర్వర్తించిన బాధ్యతల వివరాలు 22-07-2024 నుండి 12-09- 2025 వరకు ? డైరెక్టర్, ఇంటర్మీడియట్ విద్య. 22-07-2024 నుండి 12-09-2025 వరకు ? డైరెక్టర్, వయోజన విద్య. 22-07-2024 నుండి 12-09-2025 వరకు ? సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. 04-04-2022 నుండి 28-03-2024 వరకు? కలెక్టర్ %డా% జిల్లా మేజిస్ట్రేట్, కాకినాడ. 06-02-2020 నుండి 04-04-2022 వరకు ? డైరెక్టర్, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. 06-02-2020 నుండి 04-04-2022 వరకు ? డైరెక్టర్, డిఫరెంట్గా అబిల్డ్ %G% సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్.06-02-2020 నుండి 04-04-2022 వరకు ? మేనేజింగ్ డైరెక్టర్,

    9%ూరాణారారాజాూజ.%03-01-2020 నుండి 04-04-2022 వరకు ? డైరెక్టర్, మహిళా అభివృద్ధి %G% శిశు సంక్షేమం మరియు %ణ Xూనారా% స్పెషల్ ఆఫీసర్.24-06-2019 నుండి 02-01-2020 వరకు ? డైరెక్టర్, మహిళా అభివృద్ధి %% శిశు సంక్షేమం. 11-02-2019 నుండి 24-06-2019 వరకు ? జాయింట్ కలెక్టర్ %% అదనపు జిల్లా మేజిస్ట్రేట్, కృష్ణాజిల్లా. 02-11-2018 నుండి 09-02-2019 వరకు ? డిప్యూటీ సీఈవో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.

    18-11-2016 నుండి 12-08-2018 వరకుల ? జాయింట్ కలెక్టర్, గుంటూరు. 05-12-2015 నుండి 14-11-2016 వరకు ? సబ్ కలెక్టర్, మదనపల్లి. 25-04-2015 నుండి 30-11-2015 వరకు? అసిస్టెంట్ కలెక్టర్, విశాఖపట్నం. 02-09-2013 నుండి 13-04-2015వరకు (ప్రొబేషనర్), జమ్మూ కాశ్మీర్ క్యాడర్.

  • బచ్సన్ బీరంగూడలో గ్రాండ్పేరెంట్స్ డే సంబరాలు

    బచ్సన్ బీరంగూడలో గ్రాండ్పేరెంట్స్ డే సంబరాలు

    • తాతయ్యలుఅమ్మమ్మలతో ఆనంద క్షణాలు పంచుకున్న చిన్నారులు

    పటాన్ చెరు ప్రతినిధి, సెప్టెంబర్ 13 బచ్చన్ ప్రైమరీ స్కూల్లో శనివారం గ్రాండ్పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు సి. హెచ్. శ్రీనివాస్ రావు, శిరీషా రెడ్డి, ప్రిన్సిపాల్ లక్ష్మీ రాఘవేంద్ర హాజరై చిన్నారులను, పెద్దలను ఉత్సాహపరిచారు. పిల్లలు తమ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలకు అంకితంగా అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేశారు. ఆకర్షణీయమైన ర్యాంప్ వాక్, పలు వినోదాత్మక ఆటలు నిర్వహించగా,

    పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. తరువాత పెద్దలు తమ అనుభవాలను పంచుకొని మనవలు%-%మనవరాళ్లతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. కొందరుపాటలు పాడగా, మరికొందరు నృత్యాలతో వేదికను కిలకిలలతో నింపారు ఈ సందర్భంగా పిల్లలు తమ పెద్దల పట్ల గౌరవం, కృతజ్ఞత, ప్రేమను వ్యక్తం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.