Category: Andhrapradesh

Andhrapradesh News Updates

  • సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు

    సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు

    అనంతపురం, సెప్టెంబర్ 10:

    2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సభ రాజకీయాలు, ఓట్లు కోసం
    కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టున్నామని 201
    సభను ఏర్పాటు చేసినట్లు సీఎం
    పేర్కొన్నారు. సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని చెప్పేందు తాము అనంతపురానికి వచ్చామన్నారు. సూపర్ సిక్స్ పథకాల ను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని.. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అని అభివర్ణించారు.

    57 శాతం మంది ప్రజలు ఓట్లేశారని.. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని.. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హెూదా కూడా లేకుండా చేశారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిందన్నారు. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో

    రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన పెట్టుబడులను తరిమేసి.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం దాదాపు 93 పథకాలను నిలిపి వేసిందని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ గా హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారన్నారు. పెన్షన్ల, సూపర్ సిక్స్పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా అంటూ ప్రజలను ఈ సందర్భంగా
    సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

    సూపర్ సిక్స్ అంటే హేళన చేశారన్నారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యమని పేర్కొన్నా రన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. మెగా డీఎస్సీ అవ్వదన్నారు… దీపం వెలగదన్నారు… ఫ్రీ బస్సు కదలదన్నారంటూ గత వైసీపీలోని పెద్దలు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని తెలిపారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు,

    ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని.. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేశ్కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని సీఎం చంద్రబాబు వివరించారు.

  • హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న టీజీపీఎస్సీ

    హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న టీజీపీఎస్సీ

    హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ను రద్దు చేస్తూ జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విషయంపై హైకోర్టు తీర్పును తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం కమిషన్ కీలక సమావేశమై న్యాయపరమైన అంశాలు చర్చించాక తుది నిర్ణయం తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

    అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కాగా, ఏప్రిల్ నెలలో టీజీపీ ఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. అయితే, మ్యూలంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించి మెయిన్స్ మెరిట్ లిస్ట్ను రద్దు చేయాలని సంచలన తీర్పు వెల్లడించింది.

    పేపర్లు రీ వాల్యూయేషన్ చేయాలని కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దురుసు ప్రవర్తన.

    ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దురుసు ప్రవర్తన.

    రామచంద్రాపురం : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్లో నిర్మించిన తాగునీటి రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘనందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

    దీంతో ఎమ్మెల్యే నువ్వే పెద్ద లీడరు అన్ని నువ్వే చేసుకరా అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. అది కాదు అన్న సమస్యలు ఉన్నాయ్ అని మీకు రిక్వెస్ట్ చేస్తున్న.. నువ్వే లీడర్ షిప్ చేస్తున్నావ్ పబ్లిక్ తో ఎలెక్ట్ అయ్యావు కదా అనడంతో ఆయన నేనెందుకు లీడర్ షిప్ చేస్తాను అన్న అనడంతో ఉకో సప్పుడు చేయకు తమాషా చేస్తున్నావా అంటూ ఘాటుగా మాట్లాడారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనతో అక్కడ ఉన్నవారు అందరూ అవాక్కయ్యారు.

    ఎమ్మెల్యే, ఎంపీకి గేటెడ్ కమ్యూనిటీకి చెందిన మహిళలు కూడా తమ సమస్యలను విన్నవిస్తుండగా.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ సమస్య ఏంటి చెప్పండి.. ఓట్లతోని భయపెట్టకండి.. ఓట్ల కోసం బయపడేటోడు ఎవడు లేడు ఈడ అంటూ ఘాటుగా స్పందించడంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు.

  • ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

    ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

    నమస్తే న్యూస్ : శంకరపట్నం/సెప్టెంబర్/10:

    తెలంగాణ వీరవనిత రైతాంగ సాయుధ పోరాట యూదురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. రజక సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ,, భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కొంగు నడుము చుట్టి చేత కొడవలి పట్టి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరికో ప్రేరణగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున


    ఉప్పెనలా ఎగిసి పడేలా చేసిన చాకలి ఐలమ్మకు తెలంగాణ సమాజం రుణపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో
    తహసిల్దార్ సురేఖ, ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, బీజేపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు | గంట మహిపాల్,

    కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బస్వయ్య గౌడ్,బీజేపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్,సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, నాయకులు సముద్రాల సంపత్, గుళ్ల రాజు, బిజిలి సారయ్య, షారుఖ్, రజక సంఘం నియోజకవర్గ ఇన్చార్జి నాంపల్లి శంకరయ్య,

    మండల ప్రధాన కార్యదర్శి రాసమల్ల శ్రీనివాస్, నాయకులు కల్లే పెల్లి కొమురయ్య,దండు సమ్మయ్య, నాంపల్లి రాజేందర్, నేరెళ్ల సంతోష్ పావురాల శ్రీనివాస్, కల్లేపల్లి కిరణ్,రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

  • గొందళి సమాజ్ సంఘం సమగ్ర నివాదికను బీసీ కమిషన్ చైర్మెన్ కు అందజేసిన. ఏక్నాథ్ దుర్గే.

    గొందళి సమాజ్ సంఘం సమగ్ర నివాదికను బీసీ కమిషన్ చైర్మెన్ కు అందజేసిన. ఏక్నాథ్ దుర్గే.

    కూకట్ పల్లి/నమస్తే న్యూస్(మేడ్చల్ డిస్ట్రిక్) గొందళి సమాజ్ సమగ్ర నివేదికను బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కు అందజేసిన గొందళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్నాథ్ దుర్గే. బుధవారం ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాల యంలో వారి సంఘం సభ్యుల పూర్తి వివరాల నివేదిక పత్రం అందజేయడం జరిగింది.

    అనంతరం ఏక్నాథ్ దుర్గే మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తాము తమ కుల సంఘం ను బిసి జాబితాలో చేర్చాలని అనేక విజ్ఞప్తులు గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి సైతం అందజేసి వారి సంఘం సభ్యుల పూర్తి నివేదిక పత్రాలను బీసీ కమిషన్ కార్యాలయానికి అందజేయడం జరిగింది.

    సానుకూలంగా స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తమ సమస్యను సానుకూలంగా విని సమస్యను ముఖ్యమంత్రిని దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో గొందళి సమాజసంఘంసభ్యులు యు. సందీప్,పి. సంజయ్, జి. దత్తురావు, జి. అనిల్ డి. అశోక్, జి. దయానంద్, జి. సంజయ్, జి. అనిల్ కర్వన్, జి. మారుతి రావు, జి. విఠల్ రావు. పాల్గొన్నారు.

  • రైతంగ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మవర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

    రైతంగ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మవర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

    నమస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా సెప్టెంబర్ 11 పరిగి : తెలంగాణ రైతాంగ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిన పేరు చాకలి ఐలమ్మ. సామాన్య మహిళ అయినప్పటికీ, జమీందారీ విధానంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయని పరిగి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…. చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటంలో ధైర్యం, నిబద్ధత రైతులకు మాత్రమే కాక, అణగారిన వర్గాలకు, మహిళలకు, సమాజంలో న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

    1940లలో, కేవలం ఒక చెరుకు పొలం కోసం ఆమె ప్రారంభించిన పోరాటం, కౌలు రైతుల హక్కుల కోసం ఒక ఉద్యమంగా రూపాంతరం చెందింది .భూస్వాముల దోపిడీకి, అణచివేతకు ఎదురు తిరిగిన ఐలమ్మ,
    తన గొంతుతో రైతాంగానికి ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నింపారు. ఆమె జీవితం ఒక సామాన్య మహిళ సైతం సమాజంలో అసాధారణ మార్పులు తీసుకురాగలదని నిరూపించింది. ఐలమ్మ పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదు, సమానత్వం,

    న్యాయం, మరియు మానవ గౌరవం కోసం జరిగిన సంగ్రామం. బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు ఆమె ఒక
    ఆదర్శనమని మాజీ ఎమ్మెల్యే అన్నారు. చాకలి ఐలమ్మ జీవితం నీతి, నిజాయితీ, అవిశ్రాంత పోరాట స్ఫూర్తితో నిండి ఉంది. చాకలి ఐలమ్మ జీవితం ఒక వెలుగు రేఖలా, అణగారిన వర్గాల జీవితాల్లో న్యాయ జ్యోతిని వెలిగిం చింది. ఆమె పోరాటం, సూర్యకాంతిలా చీకటి అజ్ఞానాన్ని చీల్చి, రైతాంగానికి, మహిళలకు, పేదలకు ఆశాకిరణంగా నిలిచింది. ఆమె ధైర్యం, ఒక సామాన్య మహిళ సైతం అసాధారణ లక్ష్యాలను సాధించగలదని నిరూపించింది.

    నేడు ఆమె వర్ధంతిని స్మరిస్తూ… ఆమె ఆశయాలను కొనసాగించే బాధ్యతను స్వీకరించిన ప్పుడే వీర వనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళాలు అర్పించిన వాళ్ళం అవుతాం…, ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొంది, సమాజంలో న్యాయం, సమా నత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

  • అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన పే టకు చెందిన ప్రజ్ఞ శ్రీ.

    అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన పే టకు చెందిన ప్రజ్ఞ శ్రీ.

    నమస్తే న్యూస్ నారాయణఖేడ్ డివిజన్ రిపోర్టర్ పెద్ద శంకరంపేట, తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన 2025 26 అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు చెందిన బి ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఆగస్టు 30వ తేదీన అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం బిఎస్సి అగ్రికల్చర్ (అగ్రిసెట్ ). ఫలితాలు విడుదల చేయడం తో పెద్ద శంకరంపేటకు చెందిన ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు ఆమెను అభినందించారు. తన తల్లిదండ్రులు పల్లవి శంకర్ గౌడ్
    తోపాటు సోదరీమణుల ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక కాలనీవాసులు గ్రామస్తులు ప్రజ్ఞ శ్రీ ని అభినందించారు.

  • రాజీనామా ప్రసక్తే లేదు..ఏం చేసుకుంటారో చేసుకోండి: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

    గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమి చేసుకుంటారో చేసుకోండంటూ తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ వైఖరిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా అంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు.

    కొంతమంది పార్టీ పెద్దలకు భయపడి ఏమీ అనలేకపోతుండవచ్చునని రాజాసింగ్ అన్నారు. వారికి పదవి భయం ఉండవచ్చునని, కానీ తనకు ఎలాంటి పదవి ఆశ లేదని స్పష్టం చేశారు. తాను చేసే ప్రతి వ్యాఖ్య కార్యకర్తలకు మద్దతుగా ఉంటుందని అన్నారు. తన వైఖరి భిన్నంగా ఉంటుందని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ఎప్పుడు తప్పు చేసినా, తాను కచ్చితంగా ఎదురు తిరిగి ప్రశ్నిస్తానని ఆయన వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, అందుకోసం ఎవరితోనైనా పోరాడతానని ఆయన పేర్కొన్నారు.

    తనకు ఢిల్లీ పెద్దలు తరుచూ ఫోన్ చేసి మాట్లాడుతారని, తనకు అధిష్టానం పెద్దలు ఆశీర్వాదం ఉందని ఆయన అన్నారు. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతానని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ సెక్యులర్ వాదిని మాత్రం కానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరేది లేదని తేల్చి చెప్పారు.

  • ‘ఎక్సర్సైజ్ జాపడ్’భారత్-రష్యా సైనిక విన్యాసాలు ట్రంప్ హెచ్చరికలు బేఖాతరు..

    ‘ఎక్సర్సైజ్ జాపడ్’భారత్-రష్యా సైనిక విన్యాసాలు ట్రంప్ హెచ్చరికలు బేఖాతరు..

    రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు ప్రారంభించిన భారత్ ‘ఎక్సర్ సైజ్ జాపడ్’ పేరుతో వారం రోజుల పాటు కసరత్తు నిజ్నీ నగరంలో జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్10 అంతర్జాతీయంగా అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ, భారత్ తన చిరకాల మిత్రుడు రష్యాతో స్నేహబంధాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతోంది. రష్యా నుంచి ఈరోజు ‘ఎక్సర్సైజ్ జాపడ్’ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. రష్యాలోని నిజ్నీ నగరంలో ఉన్న ములినో ట్రైనింగ్ గ్రౌండ్లో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. మిగతాది 2లో…

  • వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం

    అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
    నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా
    కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత
    ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు
    మిగతాది 2లో…