Category: Cinema

Cinema News Updates

  • వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి

    వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి

    నమస్తే న్యూస్ : శంకరపట్నం/సెప్టెంబర్/16:

    పంచాయతీ రాజ్అధికారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆదేశం ఇటీవలకురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని మాన కొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లినత్యనారాయుణపంచాయతీరాజ్ అధికారులు ఆదేశిం చారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో మానకొండూర్ నియోజక వర్గంలో రోడ్ల పరిస్థితితోపాటు వివిధ అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల మాన కొండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల గురించి ఎమ్మెల్యే అధికారుల నుంచి ఆరా తీశారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల విషయమై ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదనలు పంపారా అని ఆయన సమావేశంలో ప్రశ్నించారు. మండలాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ రహమాన్, డెప్యూటీ ఈఈలు మంజులా భార్గవి, రవి ప్రసాద్, ఏఈలు సురేందర్ రెడ్డి,ప్రవీణ్,మల్లేశం,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

  • ప్రిజన్ డ్యూటీమిట్ విజేతలకు సిఎం అభినందనలు

    ప్రిజన్ డ్యూటీమిట్ విజేతలకు సిఎం అభినందనలు

    హైదరాబాద్, సెప్టెంబర్ 16:

    7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మిట్లో వివిధ పోటీలలో పతకాలు సాధించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన పోటీలలో 133 పతకాల్లో 28 సాధించారు. ఇందులో 21 బంగారు, 4 రజతం, 3 కాంస్యంపతకాలను తెలంగాణ కైవసం చేసుకున్నది. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు శివ కుమార్ గౌడ్, కళాసాగర్, డ్యూటీ – మిట్ పోటీ విజేతలు పాల్గొన్నారు.

  • జిఎస్టీ రేట్ల తగ్గింపు ప్రజలకు చేరాలిధరల వివరాలను వ్యాపారులు డిస్ప్లే చేయాలి ట్రేడర్స్ అసోసియేషన్లకు భట్టి సూచన

    జిఎస్టీ రేట్ల తగ్గింపు ప్రజలకు చేరాలిధరల వివరాలను వ్యాపారులు డిస్ప్లే చేయాలి ట్రేడర్స్ అసోసియేషన్లకు భట్టి సూచన

    హైదరాబాద్, సెప్టెంబర్16: జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలని డిప్యూటీ – సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వస్తువులు, సేవల పన్ను రేట్ల సవరణ తర్వాత డిప్యూటీ- సీఎం భట్టి విక్రమార్క ఎంసీఆర్
    హెచ్ఐర్డీలో.

  • రాజ్యాంగంపై బిజెపికిగౌరవం లేదుపాక్ క్రికెట్ ఆడడంపై కెటిఆర్ విమర్శలు

    రాజ్యాంగంపై బిజెపికిగౌరవం లేదుపాక్ క్రికెట్ ఆడడంపై కెటిఆర్ విమర్శలు

    హైదరాబాద్, సెప్టెంబర్ 16:
    భార రాజ్యాంగంపైన, సుప్రీంకోర్టుపైన బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని మంగళవారం ఉదయం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. వక్స్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీది నకిలీ జాతీయవాదమని, తమది ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయ వాదమని స్పష్టంచేశారు.

  • పవన్ కల్యాణ్ను విమర్శించే అర్హత ఆమెకు లేదు

    పవన్ కల్యాణ్ను విమర్శించే అర్హత ఆమెకు లేదు

    తిరుమల :డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను విమర్శించే అర్హత మాజీ మంత్రి రోజాకు లేదని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. పవన్ కల్యాణ్ నటుడిగా గతంలో విమానాల్లో తిరిగారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా విమానాల్లో తిరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. జబర్దస్త్ లో డ్యాన్స్ వేసి రోజా చేసిందేమిటి అని కందుల దుర్గేశ్ ఎద్దేవా చేశారు.

    పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ 90 శాతం ప్రజలకు సేవ చేస్తుంటే, కేవలం 10 శాతం మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్కు మీలా కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయా అని నిలదీశారు. పవన్ కల్యాణ్కు సినిమాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని కందుల దుర్గేశ్ మండిపడ్డారు.

    పీపీపీ పద్ధతిలో చేపట్టిన కాలేజీల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తవుతుందని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులపై పూర్తి అజమాయిషీ చేసేహక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. మొదలుపెట్టిన ఏ భవనం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో 10,644 కోట్ల రూపాయలతో 15 నెలల్లో పర్యాటక రంగానికి పెట్టుబడులు సాధించామని కందుల దుర్గేశ్ తెలిపారు. వీటి ద్వారా 8080 మందికి వీటి ద్వారా ఉపాధి లభించిందని పేర్కొన్నారు. రూ.698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులను ప్రారంభించామని చెప్పారు. వీటి ద్వారా 3554 మందికి ఉపాధి లభించిందని అన్నారు. దేశంలో పర్యాటక అభివృద్ధిలో పది రాష్ట్రాలుగా ఒకటిగా ఏపీ తయారు పెట్టుకున్నామని తెలిపారు. ఐదేళ్లలో 25 వేల కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పారు.

  • వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా

    వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా

    విశాఖపట్నం, సెప్టెంబరు 14 -: వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (విమర్శించారు. (ఆదివారం) విశాఖపట్నంలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని ఉద్ఘాటిం చారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని చెప్పుకొచ్చారు.

    ఎన్డీయే పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపో తోందని నొక్కిచెప్పారు. 2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని విమర్శించారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని జేపీ నడ్డా సూచించారు. వైఎస్ జగన్ అక్రమాలు =బయటపెడతామని జేపీ నడ్డా హెచ్చరించారు. 11 ఏళ్లలో ఇచ్చిన మాటను అమలు చేశాం.. ‘విశాఖపట్నం ఈస్ట్ కోస్టికి మణిహారం లాంటిది.

    నరేంద్రమోదీ అధికారంలోకి రాక ముందు అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేది. వైసీపీ అసమర్థ, అస్తవ్యస్త ప్రభుత్వాన్ని కూలదోసి కూటమిని ఎంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. మిగిలిన రాజకీయ పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగుపడితే.. బీజేపీ సిద్ధాంతం మీద, కేడర్ మీద ఆధారపడుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ 26 జిల్లాలో సారథ్యం యాత్ర చేశారు. ఈ సందర్భంగా మాధవ్, బీజేపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు. 11 ఏళ్లలో ఇచ్చిన మాటను అమలుఒకచేశాం’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. బీజేపీ ఐడియోలాజికల్ పార్టీ,

    ‘బీజేపీ ఐడియోలాజికల్ పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక మంది కార్యకర్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆర్టికల్ 370, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ట్రిపుల్ తలాక్ ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరిచా 11వ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉండేది. ఇప్పుడు నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది. భవిష్యత్లో మూడోదిగా అవతరిస్తుంది. డిఫెన్స్, మెడికల్ అనేక రంగాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. ఏపీలో చంద్రబాబు నాయకత్వం, మోదీ సహకారంతో కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచక పాలన ఉంది. అంధకారంలోకి వెళ్లిన ఏపీని మోదీ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళు న్నాం. మోదీ మదిలో ఏపీ ఉంటుంది. ఏపీ ప్రజల మదిలో మోదీ ఉంటారు’ అని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.

  • అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం బెంగాల్లోనూ ప్రకంపనలు

    అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం బెంగాల్లోనూ ప్రకంపనలు

    డిస్పూర్: అస్సాం లో ఆదివారంనాడు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఉదలిరి జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. 5 కిలోమీటర్ల లోతుగా ఇది సంభవించినట్టు అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్, భూటాన్లో ప్రక ంపనలు వచ్చాయి.అస్సాంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గుర య్యా రని, పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పరిస్థితిని డిజాస్టర్ మేనేజి మెంట్ బృందాలు చురుకుగా సమీక్షిస్తున్నాయి.

    కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమా చారం లేదని, తమ టీమ్లు అప్రమత్తంగా ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపా రు. పరి స్థితిని సమీక్షిస్తున్నాం: సీఎంఉదల్గురిలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అయితే ఎలాం టి ప్రాణనష్టం జరగలేదని సమాచారం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సామా జిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపా రు.అస్సాంలో భూకంపం సంభవించిందని, ప్రజల భద్రత కోసం ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ సోమాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అప్రమ త్తంగా ఉండాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్నారు.

  • సూసైడ్ ప్లాన్లో పిల్లలు, పి భర్త మృతి బతికిన భార్య

    సూసైడ్ ప్లాన్లో పిల్లలు, పి భర్త మృతి బతికిన భార్య

    బెంగళూరు: తమ పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకోవాలని భార్యాభర్తలు ప్లాన్ వేశారు. తొలుత ఇద్దరు పిల్లలను చంపారు. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకోగా భార్య బతికిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునిసంఘటనప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ జరిగింది. హెూస్కోట్తాలూకాలోనిగోనకనహళ్లి గ్రామంలో 32 ఏళ్ల శివు, భార్య మంజుల తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట అతడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.

    కాగా, కుటుంబ ఆర్థిక సమస్యలు పెరుగడంతోపాటు భార్యపై అనుమానం వల్ల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొంతకాలంగా సూసైడ్ చేసుకోవాలన్న భావనలో శిశు, మంజుల ఉన్నారు. అయితే పిల్లలు ఒంటరవుతారని వారు భావించారు. ఈనేపథ్యంలో తొలుత పిల్లలను చంపి ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేశారు. మరోవైపు శనివారం మధ్యాహ్నం శివు, మంజుల కలిసి మద్యం సేవించారు.

    సాయంత్రం 4 గంటల సమయంలో తొలుత 11 ఏళ్ల కుమార్తె చంద్రకళ గొంతునొక్కి చంపారు. ఆమె మరణించిందా లేదా అన్న నిర్ధారణ కోసం కుమార్తె తలను నీటిలో ముంచారు. ఏడేళ్ల కుమారుడు ఉదయ్ సూర్యను కూడా అదే విధంగా చంపారు. కాగా, ఆ తర్వాత ఉరి వేసుకోవడానికి మంజుల ప్రయత్నించింది.

    అయితే అనారోగ్యంతో వాంతి చేసుకున్న భర్త శివు సమీపంలోని షాపు నుంచి ఆహారం కొని తీసుకురావాలని చెప్పాడు. ఆమె తిరిగి వచ్చేసరికి శివు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు పొరుగింటి వారి ఫోన్లో తండ్రితో మంజుల మాట్లాడింది. జరిగిన విషయం చెప్పింది. మరోవైపు ఇది విన్న పొరుగింటి వారు షాక్ అయ్యారు.

    మంజుల ఇంటికి వెళ్లి చూడగా ఆమె పిల్లలు, భర్త శివు చనిపోయి కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు పిల్లలు, భర్త మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంజులను అదుపులోకి తీసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

  • పవిత్ర సిలువకొండ జాతర మహోత్సవం

    పవిత్ర సిలువకొండ జాతర మహోత్సవం

    సిలువ కొండ కమిటీ అధ్యక్షుడు సభ్యుల సహకారంతో జాతర మహోత్సవనమస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సెప్టెంబర్ 15 పూడూరు మండల పరిధిలో గట్టుపల్లి గ్రామంలో సిలువ కొండ జాతర మహోత్సవం ఎంతో రంగ రంగా వైభవంగా జరుపుటకు సిలువ కొండ కమిటీ అధ్యక్షుడు కమిటీ సభ్యుల సహకారంతో ఎంతో రంగ వైభవంగా ఏసుప్రభు యొక్క పవిత్రమైన సిల్వకొండ పుణ్యక్షేత్రం నందు జాతర కార్యక్రమాన్ని

    పరిగి విచారణ పాస్టర్ ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవాన్ని జరిపించడం జరిగింది. పవిత్రమైన సిలువ కొండ జాతర మహోూత్సవానికి చుట్టుపక్కల నుండి వచ్చిన పాస్టర్లందరికీ మరియు భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం పలికిన సిలువ కొండ అధ్యక్షుడు మరియు సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా పాస్టర్ వచ్చిన తర్వాత ఏసుప్రభు యొక్క పారిశు ద్ధ కీర్తనలు ఆయన యొక్క ప్రవచనాలు భక్తులందరికీ చాలా చక్కగా

    ఏసుప్రభు యొక్క మాటలను గాని పాటలను గాని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఆయన ప్రవచనాలతో భక్తులు ఎంతో మంత్రముక్తులైనారు ఏసుప్రభు యొక్క మాటలను గాని పాటలను గాని విని వచ్చినభక్తులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భక్తులకు అందరికీ. మధ్యాహ్నంవారందరూసదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.. అందరూ చక్కగా భోంచేసి చేయగలరని అందరికీ మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిలువ కొండ అధ్యక్షుడు కమిటీ సభ్యులు గ్రామ వచ్చిన సీనియర్ నాయకులు గ్రామ యువజన నాయకులు చుట్టుపక్కల భోజన ప్రాంతాల వారు వందల సంఖ్యలో పాల్గొనడం జరిగింది…