Category: Cinema

Cinema News Updates

  • రామచంద్రపురం డివిజన్లో 4.27 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన

    రామచంద్రపురం డివిజన్లో 4.27 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన

    పటాన్ చెరు ప్రతినిధి, సెప్టెంబర్ 13 రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కాలనీ వాసుల కోరిక మేరకు కాలనీ సొసైటీ కార్యాలయం ఆవరణంలో ఖాళీ స్థలంలో థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి హెచ్ఎండిఏ ద్వారా రూ.3.20 కోట్లు మంజూరు అయ్యాయి.

    శనివారం స్థానిక కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాట్లాడుతూ “ఎక్కడ లేని విధంగా కాకతీయ నగర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే థీమ్ పార్క్ను నిర్మిస్తాం” అని అన్నారు. అదే సందర్భంలో కాలనీలో సీసీ రోడ్లు,

    అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.1.07 కోట్లు కేటాయించి, మొత్తం రూ.4.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాకతీయ నగర్ కాలనీ అధ్యక్షులు, విభాగ సభ్యులు, కాలనీ వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు,, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు KLR ను కలిసిన దాసర్లపల్లి కాంగ్రెస్ నేతలు.

    దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు KLR ను కలిసిన దాసర్లపల్లి కాంగ్రెస్ నేతలు.

    కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమం: KLR,ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలే ఫైనల్ చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు సరిత మల్లేష్ యాదవ్ కు తొలివిడతలో ఇల్ల మంజూరు చేయాలని

    తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయం లో కిచ్చెన్నను కలిసి మార్కెట్ కమిటీ డైరెక్టర్ యుగంధర్ సహా పలువురు విజ్ఞప్తి చేశారు.వెంటనే స్పందిన లక్ష్మారెడ్డి. దివ్యాంగుడుమల్లేష్ యాదవ్ దగ్గరకు వచ్చి ఇల్లు మంజూరు చేసేలా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వ ప్రతినిధులను కోరారు. అర్హత కలిగిన మల్లేష్ ఆర్థిక, స్థితిగతులను విచారించి రంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేశారు.

    దీంతో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, సరితమల్లేష్ కుటుంబసభ్యులు కేఎస్ఆర్ కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, సన్నబియ్యం, ఉచిత బస్సుప్రయాణం సహా ప్రభుత్వ సంక్షేమపథకాలు నిరంతర ప్రక్రియగా అందిస్తామని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.

  • వ్యాయమం ఆరోగ్యానికి గొప్ప ఔషధం

    వ్యాయమం ఆరోగ్యానికి గొప్ప ఔషధం

    సూర్యాపేట జిల్లా నమస్తే న్యూస్:

    సూర్యాపేట పట్టణ జూనియర్ కళాశాలలో తెల్లవారుజాము నుండి అన్ని వయసుకులవారు వ్యాయామం కోసం బారులు తీరుతున్నారు, ఇటీవల వర్షాల కారణంగా వ్యాయామ పనిముట్లు జంగు పట్టి పాడైపోవడంతో వ్యాయామానికి వచ్చేవారు ప్రతి ఒక్క వ్యక్తి 500 రూపాయల చొప్పున జమ చేసి జిమ్ చేసే సాధనాలను రిపేర్ చేపిచ్చినట్లు తెలిపారు, ఆరోగ్య విషయంలో వారు తీసుకునే జాగ్రత్తలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.

    వ్యాయామము శరీరానికి ఒక గొప్ప ఔషధం అని వ్యాయామం చేసే వారికి బ్లడ్ సర్కులేషన్ సక్రమంగా జరిగి బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుందని తెలిపారు, మనసు కు ప్రశాంతత కలిగి నిద్ర బాగా వస్తుందని అన్నారు ఈ వ్యాయా మము జిమ్ వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యం కోసం చేసుకోవచ్చని తెలియజేశారు మహిళలు పురుషులు పిల్లలు పెద్దలు ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం జిమ్ చేసుకుం టున్నారని తెలియజేశారు,

    వర్షాలు వచ్చినప్పుడు బేరింగ్ పాడై పోవడం వలన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, కళాశాలకు సంబంధించిన యాజమాన్యం కానీ స్వచ్ఛంద సంస్థలు గాని పాడైన జిమ్ సాధనాలను రిపేర్ చేపించాలని వారు కోరుతున్నారు, ఈ జిమ్ చేసే వారిలో కన్మంత రెడ్డి రాజేష్ రెడ్డి, అల్లం రెడ్డి, శ్రీనివాస్, రిటైర్డ్ పోలీస్ అధికారి ఉద్యోగులు శారద, పద్మ జిమ్ చేసే వారిలో ఉన్నారు.

  • సర్పై సర్వ హక్కులు మావే… కాదనలేరు

    సర్పై సర్వ హక్కులు మావే… కాదనలేరు

    న్యూఢిల్లీ, సెప్టెంబరు13

    : విరామాల నడుమ ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (సర్) చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల సంఘానికి ఇటువంటి చర్యకు దిగే అధికారం అనేక విధాలుగా సంక్రమించి ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానానికి ఈ మేరకు తమ కౌంటర్ అఫిడవిట్తో కూడిన ప్రతివాదనను దేశంలో క్రమం తప్పకుండా

  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాసాధించాల్సిందే

    కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాసాధించాల్సిందే

     తెలంగాణకు 904టీఎంసీల నీటి వాటాను రాబట్టాల్సిందే ||కృష్ణా జలాల ట్రిబ్యునల్ముందు వాదనలు వినిపించాలి. న్యాయనిపుణులు, అధికారులకు సిఎం రేవంత్ ఆదేశంహైదరాబాద్, సెప్టెంబరు 13: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ | అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద

    జలాలైనాసరే..తెలంగాణాకుచెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కుడావదులుకునేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకు నేందుకు పట్టుబట్టాలన్నారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉంది.

    తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై శనివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రెడ్డి సమీక్ష సమావేశం మిగతా2లో…రేవంత్

  • బిగ్బాస్9 తెలుగు గురువారం హైలైట్స్

    బిగ్బాస్9 తెలుగు గురువారం హైలైట్స్

    ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9
    గురువారం రాత్రి చాలా ఆసక్తికరంగా సాగింది. సభ్యుల మధ్య కొన్ని గొడవలు, సరదా క్షణాలు, ప్రేమ కథలు, వోటింగ్ డ్రామాలతో హౌస్ సందడిగా మారింది. సభ్యుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా, కామెడీతో ప్రేక్షకులను నవ్వించేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా సంజనా గల్రాని కెప్టెన్ గా ఎంపిక కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక గురువారం ఎపిసోడ్లో ఏమి జరిగిందో చూద్దాం!ప్రియా షెట్టీ తన నిజాయితీని నిరూపించాలనుకునే ప్రయత్నంలో ఉండగా, మణీష్ వ్యూహాత్మకంగా ఆటను ముందుకు నడిపాడు.

    ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని హౌస్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రీతు చౌదరి ఇమాన్యుయేల్ కలిసి సరదాగా ప్రవర్తించి, హౌస్ లో నవ్వుల వర్షం కురిపించారు. దీంతో హౌస్ మెంబర్స్కు కాస్త ఉపశమనం కలిగించారు. హౌజ్ లోని సభ్యుల మధ్య జరిగిన పోటీ తర్వాత సంజనా గల్రాని కెప్టెన్ గా ఎంపికవగా.. మిగతా వారు సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు..

    రీతు చౌదరి, కళ్యాణ్ పాదాల మధ్య అనుబంధం మరింత పెరుగుతోన్నట్లు తెలుస్తోండగా ఇద్దరి తరుచూ మాట్లాడుకోవడం, దగ్గరగా ఉండడం హౌస్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బయట పబ్లిక్సైతం వీరి మధ్య నడిచే డ్రామాను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వారం మొదటి నామినేషన్ ర్స్లోలో సంజనా గల్రానిని ఇతర సభ్యులు నామినేట్ చేశారు. హౌస్ లో ఆమెపై నమ్మకం తగ్గిందని, కొన్ని అభిప్రాయ భేదాల వల్లే ఇలా జరిగిందని సభ్యులు పేర్కొన్నారు.

    దీంతో హౌస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరగా.. ప్రేక్షకుల వోటింగ్ ఫలితాలుహౌస్లోని వ్యూహాలను ప్రభావితం చేయనుండడంతో సభ్యులు తమ ఆట తీరులో మరింత జాగ్రత్తగా వహిస్తున్నారు. ఈ ఎపిసోడ్ గురువారం ప్రేక్షకులకు ఆసక్తికరమైన మలుపులతో, భావోద్వేగాలు మరియు సరదాతో నిండిన అనుభూతిని అందించింది. రానున్న బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

  • ఆ హీరో అంటే నాకు పిచ్చి

    ఆ హీరో అంటే నాకు పిచ్చి

    టాలీవుడ్ ప్రేక్షకులను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. యంగ్ బ్యూటీస్ రీసెంట్ డేస్ లో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రితిక నాయక్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

    ఈ యంగ్ బ్యూటీ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది. క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా చదవండి : మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు..

    యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు. నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా రితికా నాయక్ తనకు ఓ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.

    ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో నటించడం అనేది నా కల. ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర అయినా సరే.. ఎలాంటి సినిమా అయినా సరే నేను నటిచడానికి రెడీ. చిన్న పాత్ర అయినా సరే నటిస్తా అని రితికా నాయక్చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక రితిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

  • రీతూ వర్మ నువ్వు కూడానాఇంతషాకిచ్చావేంటి

    రీతూ వర్మ నువ్వు కూడానాఇంతషాకిచ్చావేంటి

    రీతూ వర్మ.. ఈ పేరు తెలియని, పరిచయం లేని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బాషా సినిమాలో కాజల్ స్నేహితురాలిగా కనిపించినా, ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్లో కనిపించి అలరించింది. చివరికి ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్లో పోటీకి దిగింది

    విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లి చూపులు ‘ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆశించినంతగా అవకాశాలు మాత్రం తలుపులు తట్టలేదు. ఈ క్రమంలో తమిళంలో దుల్కర్ సల్మాన్, విశాల్ వంటి స్టార్లతో కూడా సినిమాలు చేసినా ఎక్కడా టాప్కు చేరుకోలేకపోయింది. ఇండస్ట్రీకి వచ్చి పుష్కరాలు దాటినా, నటించిన సినిమాలు కూడా డజన్ దాటలేదు. చేసిన అన్ని పాత్రల్లో పక్కింటి అమ్మాయి లాగా, నిండైన చీరకట్టులో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైంది.

    దీంతో సినిమాల సంఖ్యలో వెనుకబడింది. ఏడాదికి ఒకటి తప్పితే ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. గత సంవత్సరం స్వాగ్, ఈ సంవత్సరం సందీప్ కిషన్ మజాకా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాయమైంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో కాలం గడిచేకొద్దీ అనేక మంది ముద్దుగుమ్మలు ‘రయ్’మంటూ ఎంట్రీ ఇవ్వడం, దేనికైనాసై అంటుండటం వల్ల పోటీ పెరిగి అవకాశాలు తగ్గిపోయాయి.

    ఇక చేసేదేమీ లేక రీతూ కూడా గ్లామర్ బాట | పట్టక తప్పలేదు. నిన్నమొన్నటి వరకు పక్కింటి అమ్మాయి, గర్ల్ నెక్స్ట్ డోర్లాగా కనిపించిన ఈ హైదరాబాద్ అమ్మాయి, ఉన్నపలంగా ఒక్కసారిగా తాను ఇప్పటివరకు కనిపించని విధంగా గ్లామర్ గేట్లు తెరిచి చేసిన ఫోటోషూట్ చూసిన ఆడియన్స్కుసడన్ షాక్ ఇచ్చింది. ఆ ఫోటోలు చూసిన వారంతా “ఏంటీ మనం చూస్తున్నది రీతూ వర్మనేనా? ఇలా మారిపోయిందేంటి?” అని ఖంగు తింటున్నారు. ఇప్పటికైనా అవకాశాలు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

  • షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు

    షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు

    భారత్, పాకిస్థాన్ మ్యాచ్కి ముందు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న అంటే ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న అఫ్రిదీ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.

    కొంతమంది టీమిండియా క్రికెటర్లు తాము భారతీయులం అని నిరూపించుకునేందుకు ఆరాట పడుతున్నారని అన్నాడు. అలాగే పాకిస్థాన్తో భారత్ క్రికెటర్ ఆడేందుకు వేదికలు, టోర్నమెంట్లు అంటూ భారత్ సాకులుచెబుతోందని విమర్శించారు. ఇలా ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదని అన్నాడు. ఆసియా కప్లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడొద్దనే డిమాండ్ వ్యక్తం అయినప్పటికీ.. బీసీసీఐ పాక్తో మ్యాచు ఓకే చెప్పింది.

    కానీ, అంతకంటే ముందు రిటైర్డ్ ఆటగాళ్లు పాల్గొన్న లెజెండ్స్ టోర్నీలో మాత్రం భారత మాజీ క్రికెటర్లు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. లీగ్ దశలో ఒక మ్యాచ్లో, అలాగే సెమీ ఫైనల్ మ్యాచను పాకిస్థాన్ తో ఆడాల్సి ఉండగా.. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని టీమిండియా తమకు దేశం ముఖ్యం అంటూ పాకిస్థాన్తో మ్యాచ్ను రద్దు చేసుకుంది. దీనిపై ఆ టోర్నీలో పాక్ కెప్టెన్ గా వ్యవహరించిన అఫ్రిదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు ఆడని వాళ్లు, ఇప్పుడు ఆసియా కప్లో పాకిస్థాన్తో ఎలా ఆడతారంటూ ప్రశ్నించాడు. ఈ ద్వంద్వ వైఖరి సరికాదని, పూర్తిగా పాకిస్థాన్తో క్రికెట్ ఆడటమే మానుకోవాలని కూడా అన్నాడు.