Category: Crime News

Crime News Updates

  • మహిళలకు నాణ్యమైన బతుకమ్మ చీరలు

    మహిళలకు నాణ్యమైన బతుకమ్మ చీరలు

    హైదరాబాద్, సెప్టెంబర్ 11:

    మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా కానుక ఇవ్వనుంది. ఒక్కో మహిళకు రెండు చీరల చొప్పున ఇవ్వనున్నారు. ఈ కానుకకు సంబంధించి సమాఖ్య సంఘాల మహిళల జాబితాను సెర్ఫ్,
    మెప్మా రూపొందించాయి. ముందుగా తొలి విడతకు సంబంధించిన చీరలు ఒకటి రెండ్రోజుల్లో రానున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల్లో పేరున్న మహిళలకు బతుకమ్మ చీరలు అందించింది. అయితే కొందరికి అందుకున్నా..

    చాలా మంది ఈ చీరలు తీసుకున్నారు. అయితే తీసుకున్న వారు సైతం ఈ చీరలు నాసిరకంగా ఉన్నాయని ఉపయోగించలేదు. రైతులయితే వీటిని జొన్న,

    మొక్కజొన్న వంటి చేన్ల వద్దకు పక్షులు రాకుండా ఉంచడానికి ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీటిని షోలాపూర్ లో కిలో చొప్పున కొనుగోలు చేశారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

    బతుకమ్మ, దసరా కానుకగా మంచి నాణ్యమైన చీరలు మహిళలకు కానుకగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

  • రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

    రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

    నగరంతో పాటు – రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తూ.. చర్యల్లో భాగంగా..

    పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు. హైదరాబా ద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసు అధికారులు సమన్వయం చేసుకుంటూ.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాగులపై ఉన్న లోతట్టు – కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు

    ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు – ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు చేరడంతో చెరువులను తలిపిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

    హయత్ నగర్ లో అత్యధికంగా 9 సెంటీ-మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

  • కేసులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంv

    కేసులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంv

    న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: 

    పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణీత సమయం లోపు10
    ఆమోదం తెలపాలంటూ జరిగిన విచారణపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. ఈ అంశంపై దాదాపు రోజులపాటు – సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

    అనంతరం ఈ కేసులో తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి కానీ, గవర్నర్లు కానీ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్ పెడితే.. ఆటోమెటిక్ గా మూడు నెలల తర్వాత అవి ఆమోదం పొందినట్లేనంటూ మిగతా2లో…

  • జాబ్ క్యాలెండర్ ప్రకటించినా నియామకాలు నిల్ • మీడియాతో బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు

    జాబ్ క్యాలెండర్ ప్రకటించినా నియామకాలు నిల్ • మీడియాతో బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు

    హైదరాబాద్, సెప్టెంబర్ 11:

    కాంగ్రె నాయకులు యూరియా కృత్రిమ కొరతను సృష్టించారని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్రం.. తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందని అన్నారు. అమీర్ పేట్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

    గ్రూప్- 1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యతఆయనవిూడియాతోప్రభుత్వానికి ఉందని రామచందర్ తెలియజేశా రు. గ్రూప్-1 అంశంలో


    టిజిపిఎస్సి తప్పుల మీద తప్పులు చేసిందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం కంటే ఎక్కువ సీట్లు- బిసిలకు ఇస్తామని, ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాష్ట్ర కమిటీలోదక్కలేదని
    బిసిలకు చోటు – విమర్శించారు. అధికార ప్రతినిధుల్లో వరంగల్ కు అవకాశం కల్పిస్తామని రామచందర్ రావు హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో ఇండియా కూటమిలో ఐక్యత లేదని స్పష్టమైందని రామచందర్రావు అన్నారు.

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్లకుజీతాలు రావడం లేదు.
    యూనివర్సిటీ హాస్టళ్లు అధ్వానంగా తయార య్యాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో యూనివర్సిటీ- లను నడుపుతూ భావితరాలను మిగతా2లో…

  • 3డీ యానిమేషన్ మూవీ ‘వాయుపుత్ర’..

    3డీ యానిమేషన్ మూవీ ‘వాయుపుత్ర’..

    ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 3డీ యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుని సత్తా చాటుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. ఇప్పుడు అనేక రికార్డులు కొల్లగొడుతోంది. అయితే కన్నడ సినీ ఇండస్ట్రీ నిర్మించిన ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదరగొడుతోంది.

    ఇప్పుడు టాలీవుడ్ లో కూడా యానిమేషన్ చిత్రాల సందడి మొదలైంది. ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 3డీ యానిమేషన్ వాయుపుత్ర సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ మంత్ ను కూడా అనౌన్స్ చేసింది. % శ్రీంశీ =మున% – మెగా గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఆ సినిమాను చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. డివోషనల్ జోనర్ లో కార్తికేయ మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు వాయుపుత్ర మూవీ చేస్తుండడం విశేషం.

    2026 దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది చిత్రం. అయితే వాయుపుత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. ఓ రేంజ్ లో అందరినీ
    ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న పవర్ ఫుల్ పోస్టర్.. సినిమా ద్వారా మేకర్స్ అందించాలనుకుంటున్న ఇతిహాస స్థాయి, ఆధ్యాత్మిక లోతును ఆడియన్స్ కు క్లియర్ గా అర్థమయ్యేలా చెబుతోంది.

  • ఓజ్ స్పెషల్33 అవతార్పవన్ కళ్యాణ్..!

    ఓజ్ స్పెషల్33 అవతార్పవన్ కళ్యాణ్..!

    విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో థియేటర్ల వద్ద హడావిడి మొదలు అయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా పవన్ ఫ్యాన్స్ భారీ కటౌట్స్ను ప్లాన్ చేస్తున్నారు. ప్రతి హీరో ఫ్యాన్స్, నిర్మాతలు కటౌట్స్న ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఓజీ సినిమా థియేటర్ వద్ద ఉండబోతున్న కటౌట్లు చాలా స్పెషల్ అంటూ పవన్ ఫ్యాన్స్ బల్ల గుద్ది మరీ బరాబర్ చెబుతున్నారు.

    కూకట్పల్లిలో భారీ కటౌట్ల ఏర్పాటు హైదరాబాద్ కూకట్పల్లి విశ్వనాధ్ థియేటర్ వద్ద ఏకంగా 33 కటౌట్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో నటించలేదు. కానీ కొన్ని పొలిటికల్ కటౌట్లు, కొన్ని గెస్ట్ రోల్స్ పోషించిన కటౌట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు పవన్ నటించిన ప్రతి సినిమా నుంచి ఒక కటౌట్ను ఏర్పాటు చేయబోతున్నారు. జనసేనానిగా ఒక కటౌట్, ఉప ముఖ్యమంత్రిగా ఒక కటౌట్ ఇలా మొత్తంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 33 కటౌట్ ను ఏర్పాటు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్ను సొంతం చేసుకోబోతున్నారు.

  • ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ సిక్సర్ల వర్షం!

    ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ సిక్సర్ల వర్షం!

    ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు, యువ బ్యాటర్ అభిషేక్ శర్మ నెట్ సెషన్లో విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. గంటపాటు సాగిన ప్రాక్టీస్లోలో 25 – 30 సిక్సర్లు బాదినట్లు సమాచారం. యూఏఈతో జరిగే తొలి మ్యాచ్లో దూకుడుగా ఆడాలనే సంకేతాలను టీమిండియా పంపింది. సూర్యకుమార్ యాదవ్ కూడా తమ వ్యూహాన్ని స్పష్టం చేశాడు. ఈరోజు రాత్రి భారత్, యూఏఈ తలపడనున్నాయి. తుది జట్టులో ఆల్ రౌండర్లకు ఎక్కువ అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

    ఆసియా కప్ 2025 ఆరంభ మ్యాచ్కు ముందే టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన దూకుడు ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆప్షనల్ నెట్ సెషన్లో అభిషేక్ ఒక్క గంటపాటు సాగిన బ్యాటింగ్ లో 25 నుంచి 30 సిక్సర్లు బాదాడు. బౌండరీ బయటకు టార్గెట్ గా పెట్టుకుని నెట్ ప్రాక్టీసు పూర్తిగా రేంజ్ హిట్టింగ్ ఎగ్జిబిషన్ లా మార్చేశాడు. ఈ ప్రాక్టీస్ సెషన్లో సీనియర్లలో కొందరు విశ్రాంతి తీసుకున్నా, యాభై సిక్సర్లతో స్పాట్లెట్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు అభిషేక్.

    యూఏఈపై తొలి మ్యాచ్కు ముందు టీమిండియా లక్ష్యమేంటో అభిషేక్ నెట్ సెషన్ చెప్పేసింది. స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో తన దూకుడు యత్నాలపై స్పష్టతనిచ్చాడు. అందుకోసమే అభిషేక్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. “అగ్రెషన్ లేకుండా ఈ ఆట ఆడటం అసంభవం. మేము మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు ఎప్పుడూ అగ్రెషన్తోనే ఉంటాం. నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.. ఫ్రంట్పుట్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం” అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ రోజు రాత్రి దుబాయ్ వేదికగా భారత్ – యూఏఈ మధ్య మ్యాచ్
    జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియా తన వ్యూహం చెప్పేసింది. కేవలం హిట్టింగే టార్గెట్గా భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అందుకోసమే ప్లేయింగ్ 11లో కూడా ఆల్రౌండర్లకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్ ఆడించాలి అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చూస్తున్నాడు. అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ దిగేది ఎవరు అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారనుంది. సంజూ శాంసను అవకాశం ఇస్తారా లేక శుభమన్ గిల్ను పంపిస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. ఎనిమిదో స్థానం వరకూ ఆడాలంటే జితేశ్ శర్మని జట్టులో తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

    మొత్తానికి భారత్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారనే దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా జట్టు అంచనా అభిషేక్ శర్మ, శు భీమన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ / సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

  • ఆసియా కప్లో ఆఫ్గానిస్థాన్ బోణీ

    ఆసియా కప్లో ఆఫ్గానిస్థాన్ బోణీ

    ఆసియా కప్ లో ఆఫ్ఘానిస్థాన్ శుభారంభం చేసింది. మంగళవారం టోర్నీ ఓపెనర్ గా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 94 పరుగులతో విజయం సాధించింది. అబుదాభిలోని షేక్ జయేద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ సాదిఖుల్లా అటల్ స్టన్నింగ్ అజేయ ఫిఫ్టీ (52 బంతుల్లో 73 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

    బౌలర్లలో ఆయుష్ శుక్లా, కించిత్ షాకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారీ ఛేజింగ్ లో బరిలోకి దిగిన హాంకాంగ్.. ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 94 పరుగులు మాత్రమే చేసి, 94 పరుగులతో పరాజయం పాలైంది. బాబర్ హయాత్ (39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫజల్ హక్ ఫరూఖీ, గుల్బదిన్ నయిబ్ రెండేసి వికెట్లతో హాంకాంగ్ పతనాన్ని శాసించారు. దీంతో గ్రూప్-బిలో తొలి విజయాన్ని ఆఫ్ఘాన్ దక్కించుకున్నట్లయ్యింది. టోర్నీలో తర్వాతి మ్యాచ్ బుధవారం ఆతిథ్య యూఏఈ, ఇండియా మధ్య జరుగుతుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే విధ్వంసక రహ్మానుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1) వికెట్లను కోల్పోయింది.

    ఈ దశలో వెటరన్ మహ్మద్ నబీ (33) తో కలిసి అటల్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ, వేగంగా పరుగులు జత చేశారు. మూడో వికెట్ కు 51 పరుగులు జతయ్యాక నబీ ఔటయ్యాడు. నయిబ్ (5) విఫలమైనా, అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 53, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తో కలిసి అటల్ ఆఫ్ఘాన్ కు భారీ స్కోరు అందించాడు. స్లాగ్ ఓవర్లలో వీరిద్దరూ సిక్సర్లతో రెచ్చిపోవడంతో ఆఫ్ఘాన్ అనుకున్నదానికంటే భారీ స్కోరు సాధించింది.

    భారీ టార్గెట్ ను చూసి బెంబేలెత్తిపోయిన హాంకాంగ్ చేతులెత్తేసింది. పేరుకు హాంకాంగ్ టీమ్ అయినప్పటికీ, మెజారిటీ ఇండియా, పాక్ సంతతి ప్లేయర్లే ఈ జట్టు తరపున ఆడుతున్నారు. అయితే ఆఫ్గాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు వీరివద్ద సమాధానం లేకుండా పోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ, మ్యాచ్ ను ఎప్పుడో ఆఫ్ఘాన్ కు అప్పగించింది. బాబర్ కాస్త పోరాటం చేయడంతో వంద పరుగుల మార్కు దగ్గరగా వెళ్లింది. ఈ ఫలితంతో ఆఫ్గాన్ కు ఈ టోర్నీలో తొలి విజయాన్ని సాధించింది.

  • అనకాపల్లి జిల్లాలో గిరిజనులు వినూత్న నిరసన

    అనకాపల్లి జిల్లాలో గిరిజనులు వినూత్న నిరసన

    అనకాపల్లి, సెప్టెంబర్ 10:

    బిల్లులు చెల్లించడం లేదుంటూ రహదారి పనులను కాంట్రాక్టర్ అర్థాంతరంగా నిలిపి వేశారు. దీంతో రహదారి మార్గం లేక.. గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు పూర్తిగా బురదమయం కావడంతో.. గిరిజనులు వినూత్న నిరసనకు దిగారు. ఆయా గ్రామస్తులంతా రహదారి మార్గంలో అర్థనగ్నంగా కూర్చోని నిరసన చేపట్టారు.

    ఈ ఘటన అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలం చినపాచిల, ఆర్జాపురం గ్రామాల్లో చోటు చేసుకుంది. ప్రభుత్వం చొరవ తీసుని.. 8 వేల మంది కష్టాలను తీర్చాంటూ వారంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రహదారులను పట్టించుకోలేదన్న సంగతి అందరికి
    తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు తీరన తర్వాత.. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
    అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రహదారులు నిర్మాణం చేపట్టింది. రహదారుల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్ట ర్లకు చెల్లింపులు చేసుకొంటూ వస్తుంది. అందులో భాగంగా కొంత ఆలస్యమైంది.

    ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్.. రహదారి పనులను మధ్యంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన గిరిజనులను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు సరైన రహదారి సైతం లేక పోవడంతో.. గిరిజనులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని.. తమ కష్టాలను తీర్చాలంటూ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.