Category: Crime News

Crime News Updates

  • వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం

    అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
    నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా
    కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత
    ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు
    మిగతాది 2లో…

  • ఆర్మీ చేతుల్లోకి నేపాల్ పాలన

    ఆర్మీ చేతుల్లోకి నేపాల్ పాలన

    రాజ్యాంగాన్ని తిరగారాయాలంటున్న జెన్ జడ్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసిన భారత్
    ఖాట్మండ్, సెప్టెంబర్ 10: హిమాలయ హిందూ దేశం ఆర్మీ చేతుల్లోకి వెళ్లింది. ఆర్మీ కంట్రోల్ చేసేందుకు అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. జెన్-జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళ నకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగిరాయాలని డిమాండ్ చేశారు. ఈ యువతరంగం నేపాల్ పాలనలో సమూల మార్పులు ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగా కొన్ని డిమాండ్లను ముందుంచింది. ఈ ఉద్యమం ఒక పార్టీ, మిగతా 2లో…
    ఒక వ్యక్తి కోసం కాదు.

  • లిటిల్ హార్ట్స్ హీరో కొత్త ఛాలెంజ్

    లిటిల్ హార్ట్స్ హీరో కొత్త ఛాలెంజ్

    ఈ రోజుల్లో ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే దానికి కథ ముఖ్యం. కథ, అందులోని కంటెంట్ ఆడియన్స్ ను రీచ్ అయినప్పుడే సినిమాలు ఆడుతున్నాయి. లేదంటే ఎంత పెద్ద స్టార్ సినిమాలైనా సరే ఫ్లాపులు, డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. కథ ఉంటే పోటీలో పెద్ద సినిమాలున్నా సరే వాటికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్ గా అలాంటి ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఘాటీ, మదరాసీలను దాటి సక్సెస్ అదే లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. అదే రోజున లిటిల్ హార్ట్స్ తో పాటూ అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి సినిమాలు రిలీజైనా కేవలం ఈ ఒక్క సినిమాకే ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను కేవలం ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా చూసి చిత్ర యూనిట్ ను అభినందిస్తున్నారు. లిటిల్ హార్ట్స్ పై నాని ప్రశంసలు అందులో భాగంగానే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా లిటిల్ హార్ట్స్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్.. ఎంతో హాయిగా, సరదాగా ఉండే మూవీ.. చాలా కాలం తర్వాత హారఫ్ఫుల్ గా నవ్వుకున్నా. అఖిల్, మధు, కాత్యాయని (స్పెల్లింగ్ గురించి నాకు సరిగ్గా తెలీదు), మీరంతా నా రోజును వండర్ఫుల్ గా మార్చారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పను కానీ ప్రస్తుతానికైతే థాంక్యూ అంటూ పోస్ట్ చేశారు నాని. నా వర్క్
    గురించి తెలిశాకే కలుద్దామనుకున్నా లిటిల్ హార్ట్స్ గురించి నాని రివ్యూ చూసి ఎగ్జిట్ అయిపోయారు మౌళి. దానిక్కారణం నాని అంటే మౌళికి చాలా ఇష్టం. ఈ విషయాన్ని అతను రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కూడా చెప్పారు. తను నటించిన సినిమా బావుందని ఏకంగా ఫేవరెట్ హీరోనే చెప్పేసరికి మౌళి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాని పోస్ట్ కు మౌళి రిప్లై ఇస్తూ, చాలా థాంక్స్ నాని అన్నా, నీకు తెలియకపోవచ్చు కానీ పిల్ల జమీందార్ నుంచి నేను మీకు చాలా పెద్ద ఫ్యాను. ఈ సినిమా కంటే ముందే మిమ్మల్ని కలుద్దామనుకున్నా కానీ నేనొక ఫ్యాన్ లా కాకుండా నా వర్క్ మీకు తెలిశాకే కలుద్దామని ఫిక్స్ అయి, దాని కోసం కష్టపడ్డా, ఈ రోజు కొట్టా. మౌళి ఎప్పటికీ నాని డై హార్డ్ ఫ్యానే. ఇవాళ కొత్త ఛాలెంజ్ పెట్టుకున్నా. ఏదొక రోజు నీ గోడలో ఇటుక అవుతా పక్కా అంటూ రాసుకురాగా, ప్రస్తుతం మౌళి చేసిన ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మౌళి కోరిక తీరేనా? అయితే మౌళి నీ గోడలో ఇటుక అవుతా అనే మాట వాడటానికి ఓ రీజనుంది. నాని గతంలో తన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఒకదానిలో తాను ఓ స్ట్రాంగ్ గోడను నిర్మిస్తున్నానని, అందులో ప్రతీ ఇటుకా ఓ పెద్ద డైరెక్టర్ అని పేర్కొన్నారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నాని ఓ బ్యానర్ ను నిర్మించి అందులో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కొత్త డైరెక్టర్లను నాని ఇండస్ట్రీకి పరిచయం చేయగా, ఇప్పుడు మౌళి కూడా నాని గోడలో ఓ ఇటుకగా మారాలనుకుంటున్నారు.

  • హైదరాబాద్, విజయవాడల్లో ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్స్హైదరాబాద్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరు ?

    హైదరాబాద్, విజయవాడల్లో ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్స్హైదరాబాద్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరు ?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు- నిర్వహించనున్నట్టు- సమాచారం. హైదరాబాద్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాకు అన్నయ్య చిరంజీవి వస్తే, అది మెగా ఫ్యాన్స్కి డబుల్ సెలబ్రేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిరు-పవన్ కలిసి చాలా కాలం తరువాత ఒకే వేదికపై కనిపించనుండడం ఈ ఈవెంటు మరింత ప్రత్యేకతను తెస్తుంది. ‘ఓజీ’ పై అంచనాలు నేడు దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్షలాది టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో అమ్ముడవుతున్నాయి. అక్కడి డిస్ట్రిబ్ర్యూషన్ కంపెనీలు ఈ ఫిల్మ్ పెద్ద హిట్టు- అని ముందే ఊహిస్తున్నాయి. టీజర్, గ్లింప్స్, సాంగ్స్కు భారీ రెస్పాన్స్ రావడం వలన ఈ క్రేజ్ మరింత పెరిగింది.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించనున్నట్టు- సమాచారం. అంతేకాదు, డ్యూయెల్ పాత్ర పోషించినట్టు- ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం ద్వారా పవన్ తన ఫ్యాన్స్కి మళ్లీ మాస్ ట్రీ-ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఇటీ వల హరిహర వీరమల్లుతో నిరాశలో ఉన్న అభిమానులు, క్షఏ ద్వారా ఊపిరి పీల్చుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాయి. ఓజీ బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉండబోతుందని టాక్. ఈ సినిమా కోసం థమన్ బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడట.

  • బ్యాటిల్ ఆఫ్ గల్వాన్కల్నల్ సంతోష్ బాబుపాత్రలో కండలవీరుడు

    బ్యాటిల్ ఆఫ్ గల్వాన్కల్నల్ సంతోష్ బాబుపాత్రలో కండలవీరుడు

    బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ డ్రామా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఈ సినిమాకు అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ – చిత్రాంగద సింగ్ కథానాయికగా నటించబోతుంది. సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. భారతదేశం-చైనా సరిహద్దులో 2020లో జరిగిన గల్వాన్ లోయ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు- సల్మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించబోతున్నట్లు – సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • ఎఐ సాయంతోఅశ్లీల కంటెంట్హైకోర్టును ఆశ్రయించిన నటి ఐశ్వర్యారాయ్

    ఎఐ సాయంతోఅశ్లీల కంటెంట్హైకోర్టును ఆశ్రయించిన నటి ఐశ్వర్యారాయ్

    బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల చిత్రాలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు- ఐశ్వర్య పేర్కొంది. అయితే ఈ కేసు నేడు విచారణకు రాగా.. ఐశ్వర్య తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథీ మాట్లాడుతూ.. ఐశ్వర్య రాయ్ చిత్రాలు కానీ, రూపం కానీ ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదు. ఒక వ్యక్తి ఆమె పేరు ముఖాన్ని ఉపయోగించి ఆది ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు అని సేథీ వాదించారు. ఆమె పేరు రూపం ఎవరిదో లైంగిక కోరికలు తీర్చడానికి ఉపయోగించబడుతోంది. ఇది చాలా దురదృష్టకరం అని ఆయన కోర్డు ముందు పేర్కొన్నారు. అయితే ఐశ్వర్య పిటిషన్ని విచారించిన జస్టిస్ తేజస్ కరియా దీనిపై ప్రతివాదులకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందుకి.. ఆ తర్వాత జనవరి 15, 2026న కోర్టు ముందుకి వాయిదా వేసినట్లు- హైకోర్టు తెలిపింది

  • ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఆర్థిక సాయం అందించండి

    ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఆర్థిక సాయం అందించండి

    వరదలు, వర్షాల వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోండి • రుణాల రీ స్ట్రక్చర్కు అనుమతించి భారం తగ్గించండి • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మకు సిఎం రేవంత్ వినతి
    న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు | ఆర్థిక సాయం అందించాలని సిఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈమేరకు
    కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ- అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టంపై ఆర్థికమంత్రికి నివేదిక అందజేశారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు సీఎం వెంట ఉన్నారు. రేవంత్రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అయ్యారు. ఈ భేటీ-లో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాలను ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామనికి ఇచ్చింది రేవంత్రెడ్డి ప్రభుత్వం.