Category: National News
National News Updates
-

‘కిష్కింధపురి’పై మెగాస్టార్ ప్రశంసలు..
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నుంచి అద్భుతమైన ప్రశంసలు అందాయి. ఈ చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ,
“కిష్కింధపురి’ సినిమా నాకు నిజంగా బాగా నచ్చింది. ఇది కేవలం సాధారణ హారర్థ్రిల్లర్ మాత్రమే కాదు. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి ఎంచుకున్న సైకలాజికల్ యాంగిల్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది” అని కొనియాడారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన ఎంతో బాగుందని, అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని మెచ్చుకున్నారు. సినిమా సాంకేతిక అంశాల గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మంచి ఎనర్జీ ఇచ్చాయి.
టెక్నికల్ వర్క్ సినిమా స్థాయిని మరింత పెంచింది. నా తదుపరి చిత్రం ‘శివ శంకర వరప్రసాద్ గారు’కు నిర్మాతలుగా ఉన్న సాహు గారపాటి ఈ సినిమాకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది” అని తెలిపారు. ఇలాంటి ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని, థియేటర్లలో చూసి ఈ చిత్రాన్ని ప్రోత్సహించాలని ఆయన ప్రేక్షకులను కోరారు. ప్రస్తుతం మంచి స్పందనతో నడుస్తున్న ‘కిష్కింధపురి’ చిత్రానికి మెగాస్టార్ ప్రశంసలు తోడవడంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నార
-

ఆసియా కప్ మ్యాచ్ భారత్ గెలవడం పక్కా• షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
దేశ మంతట కూడా భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ తర్వాత చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కు మరింత హైవోల్టేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలొ ఇప్పటికే భారత్ లో దీనిపై పెద్ద రాజకీయా దుమారం చెలరేగుతుంది. పహల్గంలో మనదేశపౌరుల్ని మతం అడిగి మరీ చంపిన దాయాదికి పాక్ కు చెందిన వారితో మ్యాచ్ అవసరమా అంటూ కూడా అపోసిషన్ పార్టీలు మండిపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ బాధితులు సైతం ఈ మ్యాచ్ పై తమ వ్యతిరేకతను చాటు తున్నారు. మరోవైపు దీనిపైభారత్ ఆడకుంటే.. పాయింట్స్ పాక్ కు వెళ్లిపోతాయని క్రీడల మంత్రి క్లారీటీ సైతం ఇచ్చారు. మరోవైపు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసియాకప్ పై తన స్టైల్ లొ కామెంట్లు చేస్తున్నాడు. ఇప్పటికే ఈమ్యాచ్ కోసం టికెట్లు అమ్ముడు పోలేదంటూ కూడా వస్తున్న ప్రచారంను కొట్టిపారేశారు. తాజాగా.. మరోసారి ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం పక్కా అంటూ జోస్యం చెప్పారు. ఈ మ్యాచ్లో ఒక షోలో జరిగిన చర్చలో అక్తర్ పాల్గొన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుపై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూనే పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చాడు. భారత జట్టును పాకిస్తాను అధిగమిస్తుందనే విషయం చాలా స్పష్టంగా కన్పిస్తుందన్నాడు. పాక్ ను ఘోరంగా ఓడించాలని చూస్తారు.. ఇది చాలా సులభమేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఫైనల్లో పాక్ తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్తో ఆడాలని చూస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లిలేకపొవడం ఒక రకంగా పాక్ కు కలిసి వస్తుందని మిస్బా మరో వ్యాఖ్యత మాట్లాడగా.. దీన్ని అక్తర్ ఖండించాడు. భారత్ కనుక మొదట్లో వికెట్లు కొల్పోతే.. పాక్ కు విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే అని అక్తర్ అన్నాడు. అంతే కాకుండా.. భారత మిడిలార్డర్ ఎంతో బలంగా ఉందో చెప్పాడు.
-

కిమ్ తలచుకుంటే పేర్లకు కొదవా
ఐస్క్రీమ్పేరునుకడా మార్చేసిన ఘనుడు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: రాజు తలచుకుంటే దెబ్బలకు కాదువా.. అన్నది సామెత. ఉత్తర కొరియా ఇందుకు అతీతంకాదు. ఎందుకంటే ఇక్కడి నయింత ఏది చెబితే అదే జరుగుతుంది. జరిగి తీరాలి కూడా. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు ఎందుకో ఐస్ క్రీమ్ మీద కోపం వచ్చింది. వెంటనే ఓ నిర్ణయం తీసుకొన్నారు. ఏకంగా దాని పేరునే మార్చేశారు. సాంస్కృతిక నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు..
పనిలోపనిగా మరికొన్ని ఫేమస్ పదార్థాల పేర్లను కూడామార్చేశారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఐస్క్రీమ్’ అనేది ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టే పేరు. కానీ, ఉత్తరకొరియా అధినేత మాత్రం ఈ పేరు వల్ల విదేశీ ప్రభావం ప్రజలపై పడుతుందని అనుమానించారు.
దీంతో ఉత్తరకొరియా భాషలో ‘ఎసుకిమో’గా మార్చేశారు. లేకపోతే ..ఇయోరియెంబో సింగిగా పిలవాలని మినహాయింపు ఇచ్చారు. వీటికి ‘ఐసు మిఠాయి’ అని అర్థం. ఈ విషయాన్నిడెయిలీ ఎన్కో పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా, పశ్చిమదేశాల పదాలను దేశ భాష నుంచి తొలగించడమే దీని లక్ష్యంగా వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరకొరియా లోని టూర్ గైడ్లకు వాన్సన్ సహా పలు ప్రదేశాల్లో మూడు నెలల శిక్షణ ప్రారంభించింది. దానిలోభాగంగా విదేశీ పర్యాటకులతో మాట్లాడే సమయంలో కూడా ఎటువంటి ఇంగ్లిష్ పదాలు రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో వెల్లడించారు. అయితేవిదేశీ పర్యాటకులతో అలా ఎలా మాట్లాడతామంటూ వారు తలలు పట్టుకొంటున్నారు. కిమ్ చెప్పాక చేయడం మినహా మరో ఆప్షన్ లేకపోవడంతో..
శిక్షణలకు హాజరవుతున్నారు.సాధారణంగా ఆర్కిటిక్, అలాస్కా, కెనడా, గ్రీన్ల్యాండ్,సైబీరియాల్లో ఎస్కిమో అనే జాతి ఉందని మనకు తెలుసు. తాజాగా ‘ఎసుకిమో’ పదం కూడా దానిని పోలి ఉండటంతో గందరగోళం నెలకొంది. మరికొన్ని పదార్థాల పేర్లలో కూడా మార్పులు.. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన హామ్బర్ట్ పేరును కూడా కిమ్ మార్చేశారు. దీనిని డాజిన్-గోగి గియోపాంగ్గా పిలవాలని ఆదేశించారు. గ్రౌండ్ బీఫ్తా రెండు బ్రెడ్లు అని అర్థం. కారియోక్ మెషిన్ల పేరును కూడా ఉత్తరకొరియా నియంత మార్చేశారు. పర్యాటకులు తమ దేశంలో ఉన్నప్పుడు వారు దక్షిణ కొరియా పదాలు వాడకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల కంగ్వాన్ ప్రావిన్స్లోని బీచ్ వద్ద వాన్సన్ అనే విలాసవంతమైన రిసార్ట్ హబ్న అభివృద్ధి చేశారు. దీని
అధికారి ఒకరు మాట్లాడుతూ విదేశీ ప్రభావం నుంచి ఉత్తర కొరియా వాసులను రక్షిస్తూ టూరిజాన్ని ప్రమోట్ చేయడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. -

ఇకపై యేటా డీఎస్సీ నియామకాలకు నోటిఫికేషన్ జారీ
అమరావతి, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మెగా డీఎస్సీని విజయవంతంగా నెరవేర్చింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నియమక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇందులో 15,941 పోస్టులు భర్తీకాగా.. 406 మిగులు పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి తుది మెరిట్ జాబితాను కూడా తాజాగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఈ జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజాగా దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు.
డీఎస్సీలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు పట్టుదలతో సిద్ధంకావాలని, అవకాశం తప్పకుండా వస్తుందని అన్నారు. ఇక తుది జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ.. విద్యావ్యవస్థను బలోపేతంచేయాలని, మోడల్ ఆఫ్ ఎడ్యుకేషనన్ను ప్రతి తరగతి గదికీ చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారని అన్నారు.
డీఎస్సీని 150రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొంటూ లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. ఇక తాజా డీఎస్సీలో మిగిలిన 406 పోస్టుల్లో ఏయే జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎన్ని చొప్పున ఖాళీలు ఏర్పడ్డాయో కూడా సర్కార్ వెల్లడించింది. అనంతపురంలో 56 పోస్టులు, చిత్తూరులో 70, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 19, కడపలో 32, కృష్ణాలో 10, కర్నూల్లో 88, నెల్లూరులో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రకాశంలో 11, శ్రీకాకుళంలో 8, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, పశ్చిమ గోదావరిలో 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్ 1లో 5, జోన్ లో 17, జోస్ 3లో 14, జోస్ 4లో 19 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను వచ్చే డీఎస్సీలో భర్తీచేసే అవకాశం ఉంది.
-

కిలో ఉల్లి మూడు రూపాయలేనా మీరు సాధించిన రికార్డు ఎవ్వరికీ సాధ్యం కాదుఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఎద్దేవా
అమరావతి: ఉల్లి ధరల భారీ పతనం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా అని సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా?
ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా అని అన్నారు. క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది అని చంద్రబాబును జగన్ నిలదీశారు.
ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లోనెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో రూ. 29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు. రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకుఎందుకు ధర రావడం లేదని నిలదీశారు. ఇది మీ తప్పు కాదా చంద్రబాబుగారూ అని ప్రశ్నిం చారు. గారూ పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?
కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ % ఇంతజరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయమని మండిపడ్డారు. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదన్నారు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారూ.. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని డిమాండ్ చేశారు.
-

మూసీలో బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ
హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్ పూర్లో దారుణ హత్య జరిగింది. 3 రోజుల క్రితం మహిళను హత్య చేసి మూసి నదిలో పడేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో.. మహిళ మృతదేహంగా గుర్తించారు. మహిళా ఒంటిపై దుస్తులు లేకపోవడంతో హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ హత్యకు గల కారణాలపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతి త్వరలోనే ఈ హత్యకు గల నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో మహిళ డెడ్ బాడీ కలకలం.
గుర్తు తెలియని మహిళ “లను హత్య చేసిన దుండగులు. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం. మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు స్వేకరిస్తున్నాయి. కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళలను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు. మూసీలో బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ.. అంతు చిక్కని మిస్టరీగా మర్డర్ కేసు రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్ పురా డెడ్ బాడీని చూసి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనస్థలికి చేరుకున్నాం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించాము. డెడ్ బాడీని మహిళా డెడ్ బాడీగా గుర్తించాం. ఎక్కడో హత్య చేసి కిస్మత్ పురలో పడవేసినట్టుగా అనుమానిస్తున్నాం. డెడ్ బాడీ కుళ్ళిన స్థితిలో ఉంది. హత్య జరిగి రెండు మూడు రోజులు అయిఉండవచ్చు.
మృతురాలి వయసు 25 నుంచి30సంవత్సరా లలోపు ఉంటుందని భావిస్తున్నాం. డెడ్ బాడీ దొరికిన ప్రాం తానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి వెరిఫై చేస్తున్నాం. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నాం. స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నాం. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తాం. ఘటనా స్థలంలో క్లూస్, అలానే ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నాం. మృతురాలు ఎవరు.. ఆమెను హత్య చేసింది అన్నది ఎవరు? అన్నది త్వరలోనే తేలుస్తామని వెల్లడించారు. రేప్అండ్మర్డర్..? మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు స్వేకరిస్తున్నాయి. కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళలను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.. స్థానిక పరిసరాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
-

ఏడీఈ అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల నగదు సీజ్
హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. అయితే అంబేద్కర్ నివాసంతో పాటు బంధువుల ఇంట్లో లెక్కలేనంతా డబ్బు బయటపడుతుంది. ఆస్తులు కూడా భారీ స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ.2 కోట్ల నగదు పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. భారీగా బంగారం కూడా పట్టుబడింది.
ఈ బంగారం విలువను కూడా అధికారులు లెక్కిస్తున్నారు. రూ. 2 కోట్ల నగదును చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. అన్ని రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. రూ. 200 నోట్ల కట్టలు ఒకట్రెండు ఉన్నాయి. ఈ నగదును లెక్కపెట్టేందుకు నోట్ల లెక్కింపు యంత్రాల సహాయం తీసుకున్నారు అధికారులు. సాయంత్రంలోగా మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏడీఈ బంధువులు,
కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి మాదాపూర్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడుతున్నాయి. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం ఏసీబీ డీఎస్పీఆనంద్ తెలిపారు.
-

అంగన్వాడి టీచర్లకు పోషన్ బీబడాయి బీ శిక్షణ
నమస్తే న్యూస్: శంకరపట్నం/ సెప్టెంబర్/16: ఎల్ఎండి కాలనీ పోషణ్ బి భడాయి బి’ ప్రోగ్రాం సందర్భంగా ఐదు మండలాలకి శంకరపట్నంతో పాటుగా మిగతా నాలుగు మండలాలకి ఎల్ఎండి కాలనీలో కరీంనగర్జిల్లా హెల్త్ అధర్నిసు పౌష్టికాహారం గురించి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా శంకరపట్నం మండల నుండి వచ్చిన వారికి ఆరోగ్య అధికారులు సిబ్బందికి సలహాలు సూచనలు పౌష్టికాహారం, ఆరోగ్యం, గురించి వీటమిన్లు, పరిరక్షణపై వివరించడం జరిగింది. దుర్గాబాయి మహిళ శిశు వికాస్ కేంద్రంలోఎల్ ఎండి కాలనీ లో ఈ కార్యక్రమం జరిగింది.


