ఓజ్ స్పెషల్33 అవతార్పవన్ కళ్యాణ్..!

విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో థియేటర్ల వద్ద హడావిడి మొదలు అయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా పవన్ ఫ్యాన్స్ భారీ కటౌట్స్ను ప్లాన్ చేస్తున్నారు. ప్రతి హీరో ఫ్యాన్స్, నిర్మాతలు కటౌట్స్న ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఓజీ సినిమా థియేటర్ వద్ద ఉండబోతున్న కటౌట్లు చాలా స్పెషల్ అంటూ పవన్ ఫ్యాన్స్ బల్ల గుద్ది మరీ బరాబర్ చెబుతున్నారు.

కూకట్పల్లిలో భారీ కటౌట్ల ఏర్పాటు హైదరాబాద్ కూకట్పల్లి విశ్వనాధ్ థియేటర్ వద్ద ఏకంగా 33 కటౌట్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో నటించలేదు. కానీ కొన్ని పొలిటికల్ కటౌట్లు, కొన్ని గెస్ట్ రోల్స్ పోషించిన కటౌట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు పవన్ నటించిన ప్రతి సినిమా నుంచి ఒక కటౌట్ను ఏర్పాటు చేయబోతున్నారు. జనసేనానిగా ఒక కటౌట్, ఉప ముఖ్యమంత్రిగా ఒక కటౌట్ ఇలా మొత్తంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 33 కటౌట్ ను ఏర్పాటు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్ను సొంతం చేసుకోబోతున్నారు.

Latest News