బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల చిత్రాలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు- ఐశ్వర్య పేర్కొంది. అయితే ఈ కేసు నేడు విచారణకు రాగా.. ఐశ్వర్య తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథీ మాట్లాడుతూ.. ఐశ్వర్య రాయ్ చిత్రాలు కానీ, రూపం కానీ ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదు. ఒక వ్యక్తి ఆమె పేరు ముఖాన్ని ఉపయోగించి ఆది ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు అని సేథీ వాదించారు. ఆమె పేరు రూపం ఎవరిదో లైంగిక కోరికలు తీర్చడానికి ఉపయోగించబడుతోంది. ఇది చాలా దురదృష్టకరం అని ఆయన కోర్డు ముందు పేర్కొన్నారు. అయితే ఐశ్వర్య పిటిషన్ని విచారించిన జస్టిస్ తేజస్ కరియా దీనిపై ప్రతివాదులకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందుకి.. ఆ తర్వాత జనవరి 15, 2026న కోర్టు ముందుకి వాయిదా వేసినట్లు- హైకోర్టు తెలిపింది
Latest News
- కిలో ఉల్లి మూడు రూపాయలేనా మీరు సాధించిన రికార్డు ఎవ్వరికీ సాధ్యం కాదుఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఎద్దేవా
- రాజ్యాంగంపై బిజెపికిగౌరవం లేదుపాక్ క్రికెట్ ఆడడంపై కెటిఆర్ విమర్శలు
- అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం బెంగాల్లోనూ ప్రకంపనలు
- సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి
- రామచంద్రపురం డివిజన్లో 4.27 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన
- దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు KLR ను కలిసిన దాసర్లపల్లి కాంగ్రెస్ నేతలు.
- సర్కారా? సర్కసా?యాకుత్పురా మ్యాన్హెల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
- దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అవుతుందా..?
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభతో జగన్కు దిమ్మతిరిగింది : మంత్రి గొట్టిపాటి
















