హైదరాబాద్, విజయవాడల్లో ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్స్హైదరాబాద్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు- నిర్వహించనున్నట్టు- సమాచారం. హైదరాబాద్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాకు అన్నయ్య చిరంజీవి వస్తే, అది మెగా ఫ్యాన్స్కి డబుల్ సెలబ్రేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిరు-పవన్ కలిసి చాలా కాలం తరువాత ఒకే వేదికపై కనిపించనుండడం ఈ ఈవెంటు మరింత ప్రత్యేకతను తెస్తుంది. ‘ఓజీ’ పై అంచనాలు నేడు దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్షలాది టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో అమ్ముడవుతున్నాయి. అక్కడి డిస్ట్రిబ్ర్యూషన్ కంపెనీలు ఈ ఫిల్మ్ పెద్ద హిట్టు- అని ముందే ఊహిస్తున్నాయి. టీజర్, గ్లింప్స్, సాంగ్స్కు భారీ రెస్పాన్స్ రావడం వలన ఈ క్రేజ్ మరింత పెరిగింది.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించనున్నట్టు- సమాచారం. అంతేకాదు, డ్యూయెల్ పాత్ర పోషించినట్టు- ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం ద్వారా పవన్ తన ఫ్యాన్స్కి మళ్లీ మాస్ ట్రీ-ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఇటీ వల హరిహర వీరమల్లుతో నిరాశలో ఉన్న అభిమానులు, క్షఏ ద్వారా ఊపిరి పీల్చుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాయి. ఓజీ బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉండబోతుందని టాక్. ఈ సినిమా కోసం థమన్ బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడట.

Latest News