నమస్తే న్యూస్ : శంకరపట్నం/సెప్టెంబర్/10:
తెలంగాణ వీరవనిత రైతాంగ సాయుధ పోరాట యూదురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. రజక సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ,, భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కొంగు నడుము చుట్టి చేత కొడవలి పట్టి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరికో ప్రేరణగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున
ఉప్పెనలా ఎగిసి పడేలా చేసిన చాకలి ఐలమ్మకు తెలంగాణ సమాజం రుణపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో
తహసిల్దార్ సురేఖ, ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, బీజేపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు | గంట మహిపాల్,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బస్వయ్య గౌడ్,బీజేపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్,సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, నాయకులు సముద్రాల సంపత్, గుళ్ల రాజు, బిజిలి సారయ్య, షారుఖ్, రజక సంఘం నియోజకవర్గ ఇన్చార్జి నాంపల్లి శంకరయ్య,
మండల ప్రధాన కార్యదర్శి రాసమల్ల శ్రీనివాస్, నాయకులు కల్లే పెల్లి కొమురయ్య,దండు సమ్మయ్య, నాంపల్లి రాజేందర్, నేరెళ్ల సంతోష్ పావురాల శ్రీనివాస్, కల్లేపల్లి కిరణ్,రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
















