కూకట్ పల్లి/నమస్తే న్యూస్(మేడ్చల్ డిస్ట్రిక్) గొందళి సమాజ్ సమగ్ర నివేదికను బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కు అందజేసిన గొందళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్నాథ్ దుర్గే. బుధవారం ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాల యంలో వారి సంఘం సభ్యుల పూర్తి వివరాల నివేదిక పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం ఏక్నాథ్ దుర్గే మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తాము తమ కుల సంఘం ను బిసి జాబితాలో చేర్చాలని అనేక విజ్ఞప్తులు గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి సైతం అందజేసి వారి సంఘం సభ్యుల పూర్తి నివేదిక పత్రాలను బీసీ కమిషన్ కార్యాలయానికి అందజేయడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తమ సమస్యను సానుకూలంగా విని సమస్యను ముఖ్యమంత్రిని దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో గొందళి సమాజసంఘంసభ్యులు యు. సందీప్,పి. సంజయ్, జి. దత్తురావు, జి. అనిల్ డి. అశోక్, జి. దయానంద్, జి. సంజయ్, జి. అనిల్ కర్వన్, జి. మారుతి రావు, జి. విఠల్ రావు. పాల్గొన్నారు.
















