తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు

హైదరాబాద్ :

తెలంగాణఅభివృద్ధికి కీలకమైన రంగాల్లో రవాణా ఒకటి. ముఖ్యంగా రైల్వే కనెక్టివిటీ రాష్ట్రానికి ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో వేగంగా ప్రగతిని అందించగలదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉండటంతో.. వాటిని పూర్తి చేసి భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా కొత్త లైన్లను ప్రతిపాదించడంఅత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, రైల్వే ఉన్నతాధికారులతోసమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం ప్రత్యేకంగా వికారాబాద్%-%కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులపై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అభిప్రాయంలో.. రైల్వే మౌలిక వసతులు పూర్తయితే తెలంగాణలో సరుకు రవాణా, ప్రయాణికుల ప్రయాణం రెండింటిలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇండస్ట్రియల్ సెక్టార్లో భవిష్యత్

పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు అవసరమని సీఎం గుర్తు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే అనుసంధానంతో రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ లైన్ ఏర్పాటుతో పరిశ్రమలకు రా మెటీరియల్ సరఫరా సులభమవడంతో పాటు, ఎగుమతులకు కూడా ఊతం లభిస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాధాన్యతప్రస్తుతం హైదరాబాద్లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి రీజనల్ రింగ్ రైల్ అవసరమని సీఎం వివరించారు.

ఈ రైల్వే లైన్ ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు నేరుగా రైల్వే కనెక్టివిటీ లభిస్తుందని… ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని ఆయన తెలిపారు.

Latest News