అమరావతి, సెప్టెంబరు 11:
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సభతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిందని విమర్శించారు. జగన్కు ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ సభ దెబ్బతో వైసీపీ దుకాణం పూర్తిగా మూతపడినట్లేనని విమర్శించారు గొట్టిపాటి రవికుమార్. (గురువారం) అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా కొరతపై రైతు పోరు అంటూ జగన్ అండ్ కో హడావుడి చేస్తే ఒక్క రైతు కూడా వైసీపీకి మద్దతు తెలపలేదని విమర్శలు చేశారు. వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కాంట్రాక్టర్లను బెదిరించే రీతిలో జగన్, ఆయన అనుచరులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ తన సైకోయిజాన్నిఇంకా మార్చుకోలేదని ధ్వజమెత్తారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఇక కలేనని జగన్ డ్రామాలను ప్రజలు ఇక నమ్మరని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.
















