అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం బెంగాల్లోనూ ప్రకంపనలు

డిస్పూర్: అస్సాం లో ఆదివారంనాడు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఉదలిరి జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. 5 కిలోమీటర్ల లోతుగా ఇది సంభవించినట్టు అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్, భూటాన్లో ప్రక ంపనలు వచ్చాయి.అస్సాంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గుర య్యా రని, పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పరిస్థితిని డిజాస్టర్ మేనేజి మెంట్ బృందాలు చురుకుగా సమీక్షిస్తున్నాయి.

కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమా చారం లేదని, తమ టీమ్లు అప్రమత్తంగా ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపా రు. పరి స్థితిని సమీక్షిస్తున్నాం: సీఎంఉదల్గురిలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అయితే ఎలాం టి ప్రాణనష్టం జరగలేదని సమాచారం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సామా జిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపా రు.అస్సాంలో భూకంపం సంభవించిందని, ప్రజల భద్రత కోసం ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ సోమాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అప్రమ త్తంగా ఉండాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్నారు.

Latest News