రామచంద్రపురం డివిజన్లో 4.27 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన

పటాన్ చెరు ప్రతినిధి, సెప్టెంబర్ 13 రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కాలనీ వాసుల కోరిక మేరకు కాలనీ సొసైటీ కార్యాలయం ఆవరణంలో ఖాళీ స్థలంలో థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి హెచ్ఎండిఏ ద్వారా రూ.3.20 కోట్లు మంజూరు అయ్యాయి.

శనివారం స్థానిక కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాట్లాడుతూ “ఎక్కడ లేని విధంగా కాకతీయ నగర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే థీమ్ పార్క్ను నిర్మిస్తాం” అని అన్నారు. అదే సందర్భంలో కాలనీలో సీసీ రోడ్లు,

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.1.07 కోట్లు కేటాయించి, మొత్తం రూ.4.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాకతీయ నగర్ కాలనీ అధ్యక్షులు, విభాగ సభ్యులు, కాలనీ వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు,, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News