రైతంగ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మవర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

నమస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా సెప్టెంబర్ 11 పరిగి : తెలంగాణ రైతాంగ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిన పేరు చాకలి ఐలమ్మ. సామాన్య మహిళ అయినప్పటికీ, జమీందారీ విధానంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయని పరిగి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…. చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటంలో ధైర్యం, నిబద్ధత రైతులకు మాత్రమే కాక, అణగారిన వర్గాలకు, మహిళలకు, సమాజంలో న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

1940లలో, కేవలం ఒక చెరుకు పొలం కోసం ఆమె ప్రారంభించిన పోరాటం, కౌలు రైతుల హక్కుల కోసం ఒక ఉద్యమంగా రూపాంతరం చెందింది .భూస్వాముల దోపిడీకి, అణచివేతకు ఎదురు తిరిగిన ఐలమ్మ,
తన గొంతుతో రైతాంగానికి ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నింపారు. ఆమె జీవితం ఒక సామాన్య మహిళ సైతం సమాజంలో అసాధారణ మార్పులు తీసుకురాగలదని నిరూపించింది. ఐలమ్మ పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదు, సమానత్వం,

న్యాయం, మరియు మానవ గౌరవం కోసం జరిగిన సంగ్రామం. బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు ఆమె ఒక
ఆదర్శనమని మాజీ ఎమ్మెల్యే అన్నారు. చాకలి ఐలమ్మ జీవితం నీతి, నిజాయితీ, అవిశ్రాంత పోరాట స్ఫూర్తితో నిండి ఉంది. చాకలి ఐలమ్మ జీవితం ఒక వెలుగు రేఖలా, అణగారిన వర్గాల జీవితాల్లో న్యాయ జ్యోతిని వెలిగిం చింది. ఆమె పోరాటం, సూర్యకాంతిలా చీకటి అజ్ఞానాన్ని చీల్చి, రైతాంగానికి, మహిళలకు, పేదలకు ఆశాకిరణంగా నిలిచింది. ఆమె ధైర్యం, ఒక సామాన్య మహిళ సైతం అసాధారణ లక్ష్యాలను సాధించగలదని నిరూపించింది.

నేడు ఆమె వర్ధంతిని స్మరిస్తూ… ఆమె ఆశయాలను కొనసాగించే బాధ్యతను స్వీకరించిన ప్పుడే వీర వనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళాలు అర్పించిన వాళ్ళం అవుతాం…, ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొంది, సమాజంలో న్యాయం, సమా నత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Latest News