నమస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సెప్టెంబర్ 15 పూడూరు మండల పరిధిలో తూర్కు ఎంకేపల్లి గ్రామంలో గుంతపల్లి సాయికుమార్ వయసు 27 సంవత్సరాలు అతనికి పెళ్లి అయింది ఒక నెల పాప ఉన్నది కానీ వాటన్నిటిని ఆలోచన చేయకుండా ఫైనాన్స్ వేధింపులకు తట్టుకోలేక ఇలాంటి త్మహత్య నిర్ణయం తీసుకోవడం జరిగింది అతను గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఎయిర్పోర్ట్తో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు..
అనుకోకుండా మళ్ళీ ఒక బండి చోళ మండల్ ఫైనాన్స్ షోరూం బండి తీసుకోవడం ఫైనాన్స్ చెల్లింపు విషయంలో ఫైనాన్సర్కు ఆయనకు మాటల ఘర్షణలు జరిగిన తర్వాత ఫైనాన్సర్ అతనిపై చాలా తీవ్రంగా వేధింపు చేయడం జరిగింది. ఇట్టి విషయమై కుటుంబ సభ్యులకు ఆరోపించాడు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో అతను మనస్థాపనకు గురై శుక్రవారం నాడు శంషాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. స్థానికులు కుటుంబ సభ్యులు ఫైనాన్స్ సంస్థల వేధింపులు మితిమీరడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్రం వ్యక్తం చేశారు.
















