బచ్సన్ బీరంగూడలో గ్రాండ్పేరెంట్స్ డే సంబరాలు

  • తాతయ్యలుఅమ్మమ్మలతో ఆనంద క్షణాలు పంచుకున్న చిన్నారులు

పటాన్ చెరు ప్రతినిధి, సెప్టెంబర్ 13 బచ్చన్ ప్రైమరీ స్కూల్లో శనివారం గ్రాండ్పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు సి. హెచ్. శ్రీనివాస్ రావు, శిరీషా రెడ్డి, ప్రిన్సిపాల్ లక్ష్మీ రాఘవేంద్ర హాజరై చిన్నారులను, పెద్దలను ఉత్సాహపరిచారు. పిల్లలు తమ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలకు అంకితంగా అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేశారు. ఆకర్షణీయమైన ర్యాంప్ వాక్, పలు వినోదాత్మక ఆటలు నిర్వహించగా,

పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. తరువాత పెద్దలు తమ అనుభవాలను పంచుకొని మనవలు%-%మనవరాళ్లతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. కొందరుపాటలు పాడగా, మరికొందరు నృత్యాలతో వేదికను కిలకిలలతో నింపారు ఈ సందర్భంగా పిల్లలు తమ పెద్దల పట్ల గౌరవం, కృతజ్ఞత, ప్రేమను వ్యక్తం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Latest News