కిమ్ తలచుకుంటే పేర్లకు కొదవా

ఐస్క్రీమ్పేరునుకడా మార్చేసిన ఘనుడు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: రాజు తలచుకుంటే దెబ్బలకు కాదువా.. అన్నది సామెత. ఉత్తర కొరియా ఇందుకు అతీతంకాదు. ఎందుకంటే ఇక్కడి నయింత ఏది చెబితే అదే జరుగుతుంది. జరిగి తీరాలి కూడా. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు ఎందుకో ఐస్ క్రీమ్ మీద కోపం వచ్చింది. వెంటనే ఓ నిర్ణయం తీసుకొన్నారు. ఏకంగా దాని పేరునే మార్చేశారు. సాంస్కృతిక నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు..
పనిలోపనిగా మరికొన్ని ఫేమస్ పదార్థాల పేర్లను కూడామార్చేశారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఐస్క్రీమ్’ అనేది ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టే పేరు. కానీ, ఉత్తరకొరియా అధినేత మాత్రం ఈ పేరు వల్ల విదేశీ ప్రభావం ప్రజలపై పడుతుందని అనుమానించారు.
దీంతో ఉత్తరకొరియా భాషలో ‘ఎసుకిమో’గా మార్చేశారు. లేకపోతే ..

ఇయోరియెంబో సింగిగా పిలవాలని మినహాయింపు ఇచ్చారు. వీటికి ‘ఐసు మిఠాయి’ అని అర్థం. ఈ విషయాన్నిడెయిలీ ఎన్కో పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా, పశ్చిమదేశాల పదాలను దేశ భాష నుంచి తొలగించడమే దీని లక్ష్యంగా వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరకొరియా లోని టూర్ గైడ్లకు వాన్సన్ సహా పలు ప్రదేశాల్లో మూడు నెలల శిక్షణ ప్రారంభించింది. దానిలోభాగంగా విదేశీ పర్యాటకులతో మాట్లాడే సమయంలో కూడా ఎటువంటి ఇంగ్లిష్ పదాలు రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో వెల్లడించారు. అయితేవిదేశీ పర్యాటకులతో అలా ఎలా మాట్లాడతామంటూ వారు తలలు పట్టుకొంటున్నారు. కిమ్ చెప్పాక చేయడం మినహా మరో ఆప్షన్ లేకపోవడంతో..

శిక్షణలకు హాజరవుతున్నారు.సాధారణంగా ఆర్కిటిక్, అలాస్కా, కెనడా, గ్రీన్ల్యాండ్,సైబీరియాల్లో ఎస్కిమో అనే జాతి ఉందని మనకు తెలుసు. తాజాగా ‘ఎసుకిమో’ పదం కూడా దానిని పోలి ఉండటంతో గందరగోళం నెలకొంది. మరికొన్ని పదార్థాల పేర్లలో కూడా మార్పులు.. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన హామ్బర్ట్ పేరును కూడా కిమ్ మార్చేశారు. దీనిని డాజిన్-గోగి గియోపాంగ్గా పిలవాలని ఆదేశించారు. గ్రౌండ్ బీఫ్తా రెండు బ్రెడ్లు అని అర్థం. కారియోక్ మెషిన్ల పేరును కూడా ఉత్తరకొరియా నియంత మార్చేశారు. పర్యాటకులు తమ దేశంలో ఉన్నప్పుడు వారు దక్షిణ కొరియా పదాలు వాడకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల కంగ్వాన్ ప్రావిన్స్లోని బీచ్ వద్ద వాన్సన్ అనే విలాసవంతమైన రిసార్ట్ హబ్న అభివృద్ధి చేశారు. దీని
అధికారి ఒకరు మాట్లాడుతూ విదేశీ ప్రభావం నుంచి ఉత్తర కొరియా వాసులను రక్షిస్తూ టూరిజాన్ని ప్రమోట్ చేయడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.

Latest News