మస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా సెప్టెంబర్ 13 పరిగి :
ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా దోమ ఎస్ఐ వసంత్ జాదవ్, తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ. మాట్లాడుతూ… ఈనెల 13వ తేదీన నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్, ద్వారా పలు రకాల పాత కేసులను పరిష్కరించుకొనేందుకు ఉపయోగపడు తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమా న్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. గ్రామీణప్రాంతాల ప్రజలు వివిధ ఘర్షణలు,
సంఘటనల్లో కేసులు నమోదై, ఇంతవరకు పరిష్కారం కాని ఇతర కేసులను సైతం రాజీ చేసు కునేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. ఎవరూ ప్రతీకారాలకు పోకుండా సమస్యలను సామ రస్యంగా పరిష్కరించుకుని స్నేహభావంతో మెలగడానికి ఈ లోక్ అదాలత్ ఎంతో దోహదపడు తుందన్నారు. ప్రతి ఒక్కరూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ లోక దాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకా శాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దీనికోసం ఫిర్యాదుదారుడు, నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులని తీసుకుని పోలీసు స్టేషన్కి రావాల్సిందిగా ఎస్ఐ వసంత్ జాదవ్, కోరారు.
















