దేశ మంతట కూడా భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ తర్వాత చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కు మరింత హైవోల్టేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలొ ఇప్పటికే భారత్ లో దీనిపై పెద్ద రాజకీయా దుమారం చెలరేగుతుంది. పహల్గంలో మనదేశపౌరుల్ని మతం అడిగి మరీ చంపిన దాయాదికి పాక్ కు చెందిన వారితో మ్యాచ్ అవసరమా అంటూ కూడా అపోసిషన్ పార్టీలు మండిపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ బాధితులు సైతం ఈ మ్యాచ్ పై తమ వ్యతిరేకతను చాటు తున్నారు. మరోవైపు దీనిపైభారత్ ఆడకుంటే.. పాయింట్స్ పాక్ కు వెళ్లిపోతాయని క్రీడల మంత్రి క్లారీటీ సైతం ఇచ్చారు. మరోవైపు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసియాకప్ పై తన స్టైల్ లొ కామెంట్లు చేస్తున్నాడు. ఇప్పటికే ఈమ్యాచ్ కోసం టికెట్లు అమ్ముడు పోలేదంటూ కూడా వస్తున్న ప్రచారంను కొట్టిపారేశారు. తాజాగా.. మరోసారి ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం పక్కా అంటూ జోస్యం చెప్పారు. ఈ మ్యాచ్లో ఒక షోలో జరిగిన చర్చలో అక్తర్ పాల్గొన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుపై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూనే పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చాడు. భారత జట్టును పాకిస్తాను అధిగమిస్తుందనే విషయం చాలా స్పష్టంగా కన్పిస్తుందన్నాడు. పాక్ ను ఘోరంగా ఓడించాలని చూస్తారు.. ఇది చాలా సులభమేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఫైనల్లో పాక్ తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్తో ఆడాలని చూస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లిలేకపొవడం ఒక రకంగా పాక్ కు కలిసి వస్తుందని మిస్బా మరో వ్యాఖ్యత మాట్లాడగా.. దీన్ని అక్తర్ ఖండించాడు. భారత్ కనుక మొదట్లో వికెట్లు కొల్పోతే.. పాక్ కు విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే అని అక్తర్ అన్నాడు. అంతే కాకుండా.. భారత మిడిలార్డర్ ఎంతో బలంగా ఉందో చెప్పాడు.
















