కెసిఆర్ పరిపాలన కోల్పోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అని పేర్కొన్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం టీఆర్ఎస్ పార్టీదే అని ధైర్యంగా ప్రకటించారు.విస్తృత స్థాయిలో హాజరైన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులు సమావేశాన్ని విజయవంతం చేశారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోమాజీ మంత్రి
మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్, పట్లోళ్ల యువకిశోరం కౌశిక్ రెడ్డి అలాగే షాబాద్ మండలానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. షాబాద్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి, భారీ గజమాలతో సబితా ఇంద్రారెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయకుండా, పరిపాలన గాలికి వదిలేసి గాలి మాటలు చెప్తూ ప్రజలకి అరిచేతుల స్వర్గం చూపిస్తున్నారని స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా కాలంవృధా
చేస్తున్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక వార్డ్ మెంబర్ కూడా గెలిచే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని ఎప్పుడు ఎక్కడ ఏ ఎలక్షన్ పెట్టిన కెసిఆర్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ విజయ డంకా ముగించబోతుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు విస్తృత స్థాయిలో హాజరైన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులు సమావేశాన్ని విజయవంతం చేశారు.
















