కంచి మహేందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీకి పాలాభిషేకం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
కుకట్ పల్లి/నమస్తే న్యూస్(మేడ్చల్ డిస్టిక్)ఫతేనగర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు కంచి మహేందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీకి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ సందర్భంగా కంచి మహేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశ ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుంది అని సాధారణ కుటుంబాల జీవన వ్యయాన్ని తగ్గించడమే కాకుండా వ్యాపారులకు, రైతులకు కూడ ఊరటనిస్తుంది అని తెలియజేశారు. ప్రజల హితాన్ని కోరే ప్రధానమంత్రి మోడీ సేవలు ఎల్లప్పుడూ పేదలకు అనుకూలంగా ఉంటుందని తెలియజేసారు. దేశంలో పేదలు అనుభవిస్తున్న ఆర్థిక బాధలను చూసి కేంద్రం భారీ స్థాయిలో జిఎస్టి తగ్గుదల చేయడం తో సామాన్యులకు భారీ స్థాయిలో మేలు జరగడంతో ఫతేనగర్ డివిజన్ బిజెపి శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకొని మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి, కూకట్ పల్లి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ జిఎస్టి 28 శాతం 12 శాతం స్లాబులతో ఉండడంతో ముఖ్యంగా పేద ప్రజలుపై పడుతున్న అర్థిక భారం పడుతున్న విషయాన్ని గ్రహించి 5% చేయడంతో పేద ప్రజలపై భారీగా భారం తగినట్లు అయింది. దీనితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కంచి మహేందర్ పిలుపుమేరకు భారీ స్థాయిలో బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
. ఈ కార్యక్రమంలో ఫతేనగర్ బిజెపి నాయకులు రఘు యాదవ్, సతీష్ గౌడ్, బానిష్, రఘు, శివ, ఉషారాణి, మహాలక్ష్మి, అశోక్, వినీత్ యాదవ్, బత్తి రమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
















