ప్రిజన్ డ్యూటీమిట్ విజేతలకు సిఎం అభినందనలు

హైదరాబాద్, సెప్టెంబర్ 16:

7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మిట్లో వివిధ పోటీలలో పతకాలు సాధించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన పోటీలలో 133 పతకాల్లో 28 సాధించారు. ఇందులో 21 బంగారు, 4 రజతం, 3 కాంస్యంపతకాలను తెలంగాణ కైవసం చేసుకున్నది. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు శివ కుమార్ గౌడ్, కళాసాగర్, డ్యూటీ – మిట్ పోటీ విజేతలు పాల్గొన్నారు.

Latest News