నగరంతో పాటు – రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తూ.. చర్యల్లో భాగంగా..
పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు. హైదరాబా ద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసు అధికారులు సమన్వయం చేసుకుంటూ.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాగులపై ఉన్న లోతట్టు – కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు – ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు చేరడంతో చెరువులను తలిపిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
హయత్ నగర్ లో అత్యధికంగా 9 సెంటీ-మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
















