కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు సభ.. సోమవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

బీసీలకు 42 శాతం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ కామరెడ్డి డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు హామి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్​కు పంపడం, కేసీఆర్​ హాయాంలో తీసుకువచ్చిన 50 శాతానికి లోబడి రిజర్వేషన్ల చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్​చేసి గవర్నర్​కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపడం అక్కడ అవి పెండింగ్ లో ఉండటంతో ఆర్డినెన్స్​ను బిల్లుగా మార్చి తాజాగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్​కు ప్రభుత్వం పంపింది. ఆ బిల్లు ప్రస్తుతం గవర్నర్​దగ్గర ఉంది. బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అవుతుంది. మళ్ళీ బిల్లు పెండింగ్ లో పడితే పార్టీ పరంగా 42 శాతం ఇచ్చేందుకు కాంగ్రెస్​సిద్దమైంది.

Latest News