మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాధ శరణాలయం నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన లిమాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి,తమ వంతు సహాయంగా సహకరిస్తామని,
ఒక మంచి కార్యక్రమం కోసం ఇట్టి | భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మీ వెనువెంటే ఉంటామని భరోసా కల్పించారు అట్టి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పనులు ప్రారంభించాలని సూచించారు. అనాధ శరణాలయాన్ని నిస్వార్థంగా నడిపిస్తున్న నిర్వాహకులకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అభాగ్యులకి అరటిపండ్ల పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, శరణాలయ సభ్యులు పాల్గొన్నారు.
















