మహిళలకు నాణ్యమైన బతుకమ్మ చీరలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11:

మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా కానుక ఇవ్వనుంది. ఒక్కో మహిళకు రెండు చీరల చొప్పున ఇవ్వనున్నారు. ఈ కానుకకు సంబంధించి సమాఖ్య సంఘాల మహిళల జాబితాను సెర్ఫ్,
మెప్మా రూపొందించాయి. ముందుగా తొలి విడతకు సంబంధించిన చీరలు ఒకటి రెండ్రోజుల్లో రానున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల్లో పేరున్న మహిళలకు బతుకమ్మ చీరలు అందించింది. అయితే కొందరికి అందుకున్నా..

చాలా మంది ఈ చీరలు తీసుకున్నారు. అయితే తీసుకున్న వారు సైతం ఈ చీరలు నాసిరకంగా ఉన్నాయని ఉపయోగించలేదు. రైతులయితే వీటిని జొన్న,

మొక్కజొన్న వంటి చేన్ల వద్దకు పక్షులు రాకుండా ఉంచడానికి ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీటిని షోలాపూర్ లో కిలో చొప్పున కొనుగోలు చేశారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

బతుకమ్మ, దసరా కానుకగా మంచి నాణ్యమైన చీరలు మహిళలకు కానుకగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Latest News