Category: Telangana

Telangana News Updates

  • చిరంజీవి పాటకు కొరియోగ్రఫీ… ఉబ్బితబ్బిబ్బవుతున్న పొలాకి విజయ్

    చిరంజీవి పాటకు కొరియోగ్రఫీ… ఉబ్బితబ్బిబ్బవుతున్న పొలాకి విజయ్

    మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు దర్శకత్వం వహించడం ప్రతీ డ్యాన్స్ మాస్టర్కు ఒక చిరకాల స్వప్నం. అలాంటి అరుదైన గౌరవాన్ని యువ కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ దక్కించుకున్నారు. ఆయన తన ఆరాధ్య నటుడైన చిరంజీవి పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిన్నప్పటి నుంచి తాను ఎవరినైతే చూసి స్ఫూర్తి పొందానో, అలాంటి వ్యక్తికే డ్యాన్స్ కంపోజ్ చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా,

    బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ కీలకమైన పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చే బాధ్యతను పొలాకి విజయ్కు అప్పగించారు. ఈ సందర్భంగా విజయ్ తన ఎక్స్ ఖాతాలో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. “చిన్నప్పటి కల ఇది. ఎవరి డ్యాన్స్ చూసి పెరిగానో, ఎవరి స్టెప్పులతో డ్యాన్స్పై ఇష్టం పెంచుకున్నానో,

    ఎవరిని చూసి ఇండస్ట్రీకి రావాలని బలంగా అనుకున్నానో, అలాంటి డ్యాన్స్కు దేవుడైన మెగాస్టార్ చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం దేవుడిచ్చిన పెద్ద బహుమతి. 2025 నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరం అవుతుంది,” అని విజయ్ తన పోస్ట్లో పేర్కొన్నారు. తన చిరకాల స్వప్నం నెరవేరడానికి కారణమైన

  • భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అవుతుందా..?

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అవుతుందా..?

    ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుతమైన ప్రారంభం చేసింది. మొదటి మ్యాచ్లో భారత్ యూఏఈని 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో ఆడాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు ఈ మ్యాచ్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొంతమంది లా విద్యార్థులు భారత్-పాక్ మ్యాచ్ను రద్దు చేయాలని ఈ పిటిషన్ వేశారు. పహల్గామ్ దాడి తర్వాత మ్యాచ్ నిర్వహించడం ప్రజలను, అమరులైన భారత సైనికులను అవమానించడమేనని వాదనలు వినిపించారు. గురువారం నాడు సుప్రీంకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది.

    నలుగురు విద్యార్ధులు ఊర్వశి జైన్ నేతృత్వంలో పిటిషన్ దాఖలు చేశారు. ఊర్వశిని జస్టిస్ జె.కె. మహేశ్వరవిజయ్బిష్ణోయ్ముందుప్రవేశపెట్టగా, మ్యాచ్ను ఆపకూడదని
    ఆదేశించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది ఈ కేసును శు క్రవారానికి వాయిదా వేయాలని కోరారు. మ్యాచ్ ఆదివారం, సెప్టెంబర్ 14న జరగాల్సి ఉంది. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం “మ్యాచ్ను ఆపకూడదు” అని పేర్కొంది. మరోవైపు న్యాయవాది మళ్లీ డిమాండ్ చేస్తూ కనీసం కేసును రిజిస్టర్ చేయాలని కోరగా, సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా తిరస్కరించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించడం దేశ గౌరవానికి భంగం కలిగించడమేనని, అమరులైన భారత సైనికులు, ప్రాణాలు కోల్పోయిన వారిని అవమానించడమేనని వాదనలు వినిపించారు. క్రికెట్ను దేశ ప్రయోజనాల కంటే ఎక్కువ
    పరిగణించకూడదని వాదించారు.

  • సూర్యకుమార్ యాదవ్పై నెటిజన్లు ప్రశంసలు

    సూర్యకుమార్ యాదవ్పై నెటిజన్లు ప్రశంసలు

    ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలు, ఆటతీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శభాష్ సూరీడు మాట నిలబెట్టుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొడియాడుతున్నారు. ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణ వికె ట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు.

    ఎందుకంటే గత ఏడాది టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన చేసినా, శు భీమన్ గిల్ తిరిగి వైస్ కెప్టెన్ గా జట్టులో చేరడంతో సంజూ స్థానంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గిల్ గైర్హాజరీలో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ, పది ఇన్నింగ్స్లో మూడు శతకాలతో తన సత్తా చాటాడు. కానీ గిల్ రాకతో సంజూ ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కుతుందా లేదా అన్న ప్రశ్న అభిమానులను కలవరపెట్టింది. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే లాంటి సీనియర్ ఆట గాళ్లు ఉండగా, ఫినిషర్గా జితేష్ శర్మకు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావించారు.

    ముఖ్యంగా ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ విజయంలో జితేష్ కీలక పాత్ర పోషించడం అతనికి అదనపు బలం ఇచ్చింది. దీంతో సంజూ మరోసారి బెంచ్క పరిమితమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టమైన న సమాధానం ఇచ్చాడు. సంజూ శాంసన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతనికి తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. అలాగే తుది జట్టు ఎంపికలో న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని హింట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే, యూఏఈతో తొలి మ్యాచ్లో సంజూని ప్లేయింగ్ ఎలెవన్లో కి తీసుకోవడం ద్వారా సూర్య తన మాట నిలబెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు
    సూర్యను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కెప్టెన్ కూల్, సంజూ పై నమ్మకం చూపిన నిజమైన నాయకుడు అం టూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరో వైపు కొందరు అభిమానులు, శుభమన్ గిల్ కోసం సంజూకు అన్యాయం చేయకూడదని సూచిస్తున్నారు. సంజూను ఓపెనర్ కొనసాగిస్తేనే అతని ఆటతీరు మరింత
    మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

  • జ్ఞాన సముపార్జన ముఖ్యం ! (ఆధ్యాత్మికం )

    జ్ఞాన సముపార్జన ముఖ్యం ! (ఆధ్యాత్మికం )

    తిరుమల, సెప్టెంబర్ 11:

    మన జ్ఞానం అందరికీఉపయోగపడాలి. ఎందుకంటే మనం సాధించాలనుకొన్న కార్యంలో సన్నిహితులు మనకు సహాయంచేస్తారు. అప్పుడు మన సాధనసులువవుతుంది.జ్ఞానాన్ని
    సముపార్జించాలి. అ మనకు మార్దర్శనం చేస్తుంది. అది మనవరకే కాకుండా నలుగురితో పంచుకోవాలి.
    నువ్వు ఈ కార్యం సాధించగలవు అంటూ హితులు, మిత్రులు, సహచరులు ధైర్యం చెబితేనే హనుమ సముద్రం దాటి లంకకు చేరి కార్యం సాధించుకొని వచ్చి ‘చూశాను సీతను’ అనగలిగాడు.

    మనం ఏదైనా గొప్ప కార్యాన్ని తలపెట్టి
    పూర్తి చేయాలనుకొంటే మనకో మంచి స్నేహితుడు ఉండాలి. అతడు విమర్శకుడు, మార్గదర్శకుడైతే ఎన్నో మంచి మాటలను ఉపదేశిస్తాడు. అప్పుడు మనం అనుకొన్న సాధన సఫలమై తీరుతుంది. మనందరిలో ప్రత్యేకత ఉంది. కానీ, దాన్ని కనిపెట్టే తీరిక ఓపిక ఉంటే ఏది సాధించడంలోనైనా మనలో ప్రాజ్ఞత వికసిస్తుంది. సూర్యవంశానికి చెందిన భగీరథుడు సగరుడి వారసులకు ఉత్తమ గతులను కలగజేసేందుకు దివిజ గంగను భువికి తెచ్చే మహా ప్రయత్నం చేశాడు.

    ఈ సాధననే భగీరథ సాధన అన్నారు. ప్రతి మనిషీ అద్భుతంగా జీవించాలని ఆదిశంకరాచార్యులు తరచూ అనేవారట. అలా బతికితే ప్రతి రోజూ సాధనకు మనసు ఉరకలు వేస్తుంది. రాబోయే రోజులన్నీ ఆశాజ్యోతులవుతాయి. ఆదిశంకరులు దేశాన్ని మొత్తం కాలినడకన పర్యటించి తాను తలపెట్టినట్లు నాలుగు పీఠాలను నెలకొల్పగలిగారు. పాశ్చాత్య పురాణాల్లోని నాయకులు కండబలం కలవారు. మన భారతీయ ఇతిహాసాల్లో ధీరులు నైతికంగా ధార్మికంగా బలవంతులు. కండబలం కంటే గుండెబలం మనోబలం శక్తిమంతమైనవి.

  • మానవత్వం మరిచిన తండ్రి చిన్నారిని దారుణంగా

    మానవత్వం మరిచిన తండ్రి చిన్నారిని దారుణంగా

    కర్నూలు, సెప్టెంబరు 11:

    జిల్లాలోని దేవనకొండలో దారుణం ఘటన జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు తండ్రి వీరేశ్. అనంతరం భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి ప్రయత్నించాడు భర్త వీరేశ్. శ్రావణి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రావణికి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. కాగా, గతంలో మొదటి భార్యని చంపేసి జైలుకు వెళ్లివచ్చాడు వీరేశ్.

    అయితే, వీరేశ్ పై కర్నూల్ జిల్లా పోలీసులకు శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభతో జగన్కు దిమ్మతిరిగింది : మంత్రి గొట్టిపాటి

    సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభతో జగన్కు దిమ్మతిరిగింది : మంత్రి గొట్టిపాటి

    అమరావతి, సెప్టెంబరు 11:

    సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సభతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిందని విమర్శించారు. జగన్కు ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ సభ దెబ్బతో వైసీపీ దుకాణం పూర్తిగా మూతపడినట్లేనని విమర్శించారు గొట్టిపాటి రవికుమార్. (గురువారం) అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు.

    ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా కొరతపై రైతు పోరు అంటూ జగన్ అండ్ కో హడావుడి చేస్తే ఒక్క రైతు కూడా వైసీపీకి మద్దతు తెలపలేదని విమర్శలు చేశారు. వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కాంట్రాక్టర్లను బెదిరించే రీతిలో జగన్, ఆయన అనుచరులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ తన సైకోయిజాన్నిఇంకా మార్చుకోలేదని ధ్వజమెత్తారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఇక కలేనని జగన్ డ్రామాలను ప్రజలు ఇక నమ్మరని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.

  • తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు

    తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు

    హైదరాబాద్ :

    తెలంగాణఅభివృద్ధికి కీలకమైన రంగాల్లో రవాణా ఒకటి. ముఖ్యంగా రైల్వే కనెక్టివిటీ రాష్ట్రానికి ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో వేగంగా ప్రగతిని అందించగలదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉండటంతో.. వాటిని పూర్తి చేసి భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా కొత్త లైన్లను ప్రతిపాదించడంఅత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, రైల్వే ఉన్నతాధికారులతోసమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు.

    కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం ప్రత్యేకంగా వికారాబాద్%-%కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులపై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అభిప్రాయంలో.. రైల్వే మౌలిక వసతులు పూర్తయితే తెలంగాణలో సరుకు రవాణా, ప్రయాణికుల ప్రయాణం రెండింటిలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇండస్ట్రియల్ సెక్టార్లో భవిష్యత్

    పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు అవసరమని సీఎం గుర్తు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే అనుసంధానంతో రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ లైన్ ఏర్పాటుతో పరిశ్రమలకు రా మెటీరియల్ సరఫరా సులభమవడంతో పాటు, ఎగుమతులకు కూడా ఊతం లభిస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాధాన్యతప్రస్తుతం హైదరాబాద్లో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి రీజనల్ రింగ్ రైల్ అవసరమని సీఎం వివరించారు.

    ఈ రైల్వే లైన్ ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు నేరుగా రైల్వే కనెక్టివిటీ లభిస్తుందని… ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని ఆయన తెలిపారు.

  • మ్యాన్ హోల్లో పడిపోయిన ఐదేళ్ల బాలిక స్పందించిన చార్మినార్ జోనల్ కమీషనర్

    మ్యాన్ హోల్లో పడిపోయిన ఐదేళ్ల బాలిక స్పందించిన చార్మినార్ జోనల్ కమీషనర్

    హైదరాబాద్:

    యాకత్ పురాలో చోటు చేసుకున్న ఓ ప్రమాదకర సంఘటనపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు. మౌలాకా చిల్లా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక ఓపెన్ గా ఉన్న మ్యాన్ హెూల్లో పడిపోయిన ఘటన స్థానికులను, అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే, అదృష్టవశాత్తూ అక్కడే
    ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారిని బయటకు తీశారు. ఈ ఘటనలో బాలికకు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

    ఈ విషయం తెలిసిన వెంటనే లోకల్ డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం చిన్నారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న హైడ్రా సిబ్బంది మ్యాన్ హెూల్ను శుభ్రం చేసిన తర్వాత, తిరిగి మూయకుండా అక్కడి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ఈ ఘటనను హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చార్మినార్ జోనల్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.

  • ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ల బతుకులను రోడ్లపైకి ఈడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

    ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ల బతుకులను రోడ్లపైకి ఈడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

    రాష్ట్రవ్యాప్తంగా ఇదే వృతిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న ఆటో డ్రైవర్లు, నిన్న రైతులు, నేడు ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు భలి, గత 40 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే వృతిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు వైర్లు కట్ చేయడంతో

    సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇంటర్నెట్ వినియోగదారులు వచ్చే జండ్రల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని హెచ్చరిస్తున్న ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు మరియు వినియోగదారులు.

  • టీఆర్ఎస్ పార్టీ శక్తి ప్రదర్శన

    టీఆర్ఎస్ పార్టీ శక్తి ప్రదర్శన

    కెసిఆర్ పరిపాలన కోల్పోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అని పేర్కొన్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం టీఆర్ఎస్ పార్టీదే అని ధైర్యంగా ప్రకటించారు.విస్తృత స్థాయిలో హాజరైన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులు సమావేశాన్ని విజయవంతం చేశారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోమాజీ మంత్రి

    మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్, పట్లోళ్ల యువకిశోరం కౌశిక్ రెడ్డి అలాగే షాబాద్ మండలానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. షాబాద్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి, భారీ గజమాలతో సబితా ఇంద్రారెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.

    ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయకుండా, పరిపాలన గాలికి వదిలేసి గాలి మాటలు చెప్తూ ప్రజలకి అరిచేతుల స్వర్గం చూపిస్తున్నారని స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా కాలంవృధా
    చేస్తున్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక వార్డ్ మెంబర్ కూడా గెలిచే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని ఎప్పుడు ఎక్కడ ఏ ఎలక్షన్ పెట్టిన కెసిఆర్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ విజయ డంకా ముగించబోతుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు విస్తృత స్థాయిలో హాజరైన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులు సమావేశాన్ని విజయవంతం చేశారు.