Category: Telangana

Telangana News Updates

  • పాకిస్తాన్తో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఆడేనా

    పాకిస్తాన్తో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఆడేనా

    ఆసియా కప్ లో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు పాకిస్థాన్తో జరిగే మ్యాచ్కు సిద్ధమవుతోంది. రెండు దేశాలకు ఇది ప్రతిష్టాత్మకమైన మ్యాచ్. కాబట్టి, రెండు జట్లు గెలవాల్సిన ఒత్తిడిలో ఉన్నాయి. అందువల్ల, రెండు జట్లు బలమైన జట్టుతో మైదానంలోకి దిగనున్నాయి. ఇదిలా ఉండగా, టీమిండియా గురించి మాట్లాడితే, యూఏఈతో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ క్కు పాకిస్థాన్ తో జరిగే జట్టులో చోటు దక్కడం సందేహమేనని సంజయ్ మంజ్రేకర్ అన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో యూఏఈ జట్టు కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంత తక్కువ స్కోరుకే జట్టును ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ 2.1

    ఓవర్లలో కేవలం 7 పరుగులకు 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అయితే, తదుపరి మ్యాచ్లో కుల్దీప్కు అవకాశం లభించదని సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేశాడు. ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తన %% ఖాతాలో ‘ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన తర్వాత కుల్దీప్ యాదవ్ తదుపరి మ్యాచ్ ఆడకపోవచ్చు’ అని రాసుకొచ్చాడు. ఇంత మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ, కుల్దీప్ తదుపరి మ్యాచ్లో అవకాశం రాకపోవచ్చు అని మంజ్రేకర్ ఎందుకు అన్నాడోనని మీరందరూ ఆలోచిస్తుండవచ్చు. కానీ సమాధానం ఏమిటంటే, మంజ్రేకర్ ఈ పోస్టు టీమిండియామేనేజ్మెంట్ను ఎగతాళి చేస్తూ షేర్ చేశాడన్నమాట. నిజానికి,
    మంజ్రేకర్ ప్రకటన వెనుక కారణం టీం ఇండియాలో కుల్దీప్ కెరీర్. కుల్దీప్ 2017 లో టీం ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. కానీ, అప్పటి నుంచి చాలాసార్లు జట్టు నుంచి తొలగించారు. చాలా సందర్భాలలో, అతని మంచి ప్రదర్శన ఉన్నప్పటికీ, అతను ప్లేయింగ్ 11 నుంచి లేదా జట్టు నుంచి తొలగించారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అతని ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. 2019 లో, ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీటెస్ట్ లో 5 వికెట్లు పడగొట్టినప్పటికీ, అతన్ని తొలగించారు. తర్వాత 2021 లో, అతనికి 1 టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఆ తర్వాత డిసెంబర్ 2022 లో,

    అతనికిమళ్ళీ ఆడే అవకాశం లభించింది. బంగ్లాదేశ్తో జరిగిన ఆ మ్యాచ్లో కుల్దీప్ మళ్లీ 5 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ, అతన్ని తొలగించారు. 2024లో నేరుగా జట్టులోకి తిరిగి వచ్చిన కుల్దీప్, గత సంవత్సరం మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఆస్ట్రేలి యా పర్యటన, ఆ తరువాత ఇంగ్లాండ్ పర్యటనలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అదేవిధంగా, గత సంవత్సరం జరిగిన టీ20 ప్రపంచ కప్, అతనికి గ్రూప్ దశ మ్యాచ్లలో ఆడే అవకాశం రాలేదు.

    సూపర్-4 రౌండ్లో ఆడే అవకాశం వచ్చినప్పుడు అతను అద్భుతంగా రాణించాడు. దీని కారణంగా, అతని మంచి ప్రదర్శన తర్వాత టీం ఇండియా మేనేజ్ మెంట్ చాలాసార్లు కుల్దీప్ ను జట్టు నుంచి తప్పించడానికి ప్రయత్ని ంచింది. అందుకే మంజ్రేకర్ అలాంటి పోస్ట్ను షేర్ చేశాడు.

  • జిల్లాల్లో కదులుతున్న బిఆర్ఎస్ పునాదులు

    జిల్లాల్లో కదులుతున్న బిఆర్ఎస్ పునాదులు

    జ్యం పోస్తున్న కాషాయ నేతలు
    హైదరాబాద్, సెప్టెంబర్ 12: పలు జిల్లాల్లో గులాబీదళం టిఆర్ఎస్లోనూ అసంతృప్తి జ్వాలలు కనిపిస్తున్నాయి. పైకి కనిపించనంతగా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పార్టీ అగ్రనేతల అవినీతి కారణంగా దాని పతనం స్పష్టంగా కనిపిస్తోంది. కాళేశ్వరం, ఫార్ములా రేస్, గొర్రెల కుంభకోణం, చెరువులు, మిషన్ భగీరథ ఇలా అన్ని కేసులకు సంబంధించి
    చాపకిందనీరులా మెల్లగా ఆజ్యం పోస్తోంది. అసంతృప్త నేతలను బుజ్జగిస్తోంది. ఈ అవినీతి పార్టీలో ఉంటూ సమాధానం చెప్పుకోలేక కిందిస్థాయిలో నేతలు అపసోపాలు పడుతున్నారు.

    ఓ రకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ పై అవినీతి బురద స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీలో రెండోశ్రేణి నాయకత్వం కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. బిఆర్ఎస్లో మంత్రులు, మాజీమంత్రులు అసంతృప్తి రాగం వినిపిస్తున్న క్రమంలో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చర్చ గ్రామస్థాయిలో జోరుగా సాగుతోంది. నిప్పులేనిదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. మంత్రిపదవి కోల్పోయాక పెద్దగాపొగరాదన్న రీతిలో సాగుతోంది

    దీనికితోడు ఇక్కడా బిజెపిచురుకుగా ఉండడం లేదు. తొలిదశలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రమే చాన్స్ దక్కింది. ఇప్పటికే ఇంద్రకరణ్, “వేణుగోపాలాచారిలో బిఆర్ఎస్ను వీడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై బిజెపి వర్గాలు కన్నేసినట్లు సమాచారం. పదవులు లేకుండా,ప్రాధాన్యం లేకుండా ఉన్న నేతలపై బిజెపి నేతలు దృష్టి సారించారని సమాచారం. పలు జిల్లాల్లో బిసిలకుమితివార్తలుఅసంతృప్తితో ఉన్నట్టుగా వెలువడ్డాయి. గులాబీ కోటలో ముళ్లుగుచ్చకుంటున్నాయి.

    కొందరు మెల్లగా స్వరం పెంచుతున్నారు. బిజెపి గాలం వేస్తోందన్న భయాలు ఉన్నాయి. నివురుగప్పిననిప్పులాఉన్న అసమ్మతి జ్వాలలు ఎప్పుడైనా దహించే ప్రమాదం లేకపోలేదు. రాజకీయాల్లో ఎల్లకాలంఒకేలాఉంటారని అనుకోవడానికిలేదని అంటున్నారు. మొత్తంగా ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది.ఈనేపథ్యంలోనే పలువురు బిఆర్ఎస్ సీనియర్ నేతలు పార్టీనిసోషల్మీడియాలో ప్రచారంసాగుతుంది.దీంతోకొందరునేతలుమీడియాకు ముందుకు వచ్చి వివరణ ఇచ్చే
    ప్రయత్నం చేశారు. అలాగే మాజీ మంత్రి రాజయ్య కూడా ఇప్పటికే బాహాటంగా విమర్శలు చేశారు. కడియం శ్రీహరి లక్ష్యంగా తన అసంతృప్తిని వెళ్ల గక్కుతున్నారు. మొత్తంగా గులాబీకోటలో ఏదో జరుగుతుందన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది.

    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేయడంతో పాటు నమ్మిన బంటుగా ఉన్నటిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. పార్టీ కోసం ఎంతచేసినా లేకున్నా పదవులు దక్కక పోవడంపైపలువురు నేతలుపక్కన పెడుతున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు.

  • లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలిఎస్ఐ వసంత్ జాదవ్

    లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలిఎస్ఐ వసంత్ జాదవ్

    మస్తే న్యూస్ వికారాబాద్ జిల్లా సెప్టెంబర్ 13 పరిగి :

    ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా దోమ ఎస్ఐ వసంత్ జాదవ్, తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ. మాట్లాడుతూ… ఈనెల 13వ తేదీన నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్, ద్వారా పలు రకాల పాత కేసులను పరిష్కరించుకొనేందుకు ఉపయోగపడు తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమా న్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. గ్రామీణప్రాంతాల ప్రజలు వివిధ ఘర్షణలు,

    సంఘటనల్లో కేసులు నమోదై, ఇంతవరకు పరిష్కారం కాని ఇతర కేసులను సైతం రాజీ చేసు కునేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. ఎవరూ ప్రతీకారాలకు పోకుండా సమస్యలను సామ రస్యంగా పరిష్కరించుకుని స్నేహభావంతో మెలగడానికి ఈ లోక్ అదాలత్ ఎంతో దోహదపడు తుందన్నారు. ప్రతి ఒక్కరూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ లోక దాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకా శాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దీనికోసం ఫిర్యాదుదారుడు, నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులని తీసుకుని పోలీసు స్టేషన్కి రావాల్సిందిగా ఎస్ఐ వసంత్ జాదవ్, కోరారు.

  • బావిలో పడి యువకుడి ఆత్మహత్య

    బావిలో పడి యువకుడి ఆత్మహత్య

    మస్తే న్యూస్ నారాయణఖేడ్ డివిజన్ రిపోర్టర్ పెద్ద శంకరంపేట : తీర మనోవేదనకు గురైన యువకుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పెద్దశంకరంపేట మండలం మూసాపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్పైప్రవీణ్ణి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోనరి మూసాపేట గ్రామానికి చెందిన బైకాని దేవయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు గంగమేశ్వర్ని టేక్మాల్ మండలం హసన్మహామ్మద్పల్లి గ్రామానికి చెందిన ఎక్కల మానసతో వివాహం చేసి ఇల్లరికం తీసుకెళ్లారు.

    మూడు నెలల క్రితం గంగమేశ్వర్తో మానసకు వచ్చిన విభేదాల కారణంగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో గంగమేశ్వర్పై కేసునమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. పది రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన గంగమేశ్వర్ మూసాపేట గ్రామంలోనే తండ్రి వద్ద ఉంటున్నాడు. కేసులో నిందితునిగా ఉన్న గంగమేశ్వర్ 12.09.2025న కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. 11వ తేదిన (గురువారం) సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు.

    బంధువులు అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం గ్రామ శివారులోని గోండ్లరాములు వ్యవసాయ బావి దగ్గర గంగమేశ్వర్ ఫోన్, దుస్తులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బావిలో వెతకగా అతని మృతనేహం లభించింది. జైలు కస్టడీపై ఏర్పడిన భయం కారణంగానే గంగమేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబీకులు పేర్కొన్నారు. మృతుని తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

  • మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మాతృదేవోభవ అనాధ శరణాలయంను పట్లోళ్ల కౌశిక్ రెడ్డి సందర్శించారు.

    మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మాతృదేవోభవ అనాధ శరణాలయంను పట్లోళ్ల కౌశిక్ రెడ్డి సందర్శించారు.

    మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాధ శరణాలయం నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన లిమాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి,తమ వంతు సహాయంగా సహకరిస్తామని,

    ఒక మంచి కార్యక్రమం కోసం ఇట్టి | భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మీ వెనువెంటే ఉంటామని భరోసా కల్పించారు అట్టి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పనులు ప్రారంభించాలని సూచించారు. అనాధ శరణాలయాన్ని నిస్వార్థంగా నడిపిస్తున్న నిర్వాహకులకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అభాగ్యులకి అరటిపండ్ల పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, శరణాలయ సభ్యులు పాల్గొన్నారు.

  • సర్కారా? సర్కసా?యాకుత్పురా మ్యాన్హెల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

    సర్కారా? సర్కసా?యాకుత్పురా మ్యాన్హెల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

    ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ
    లోపం వల్లే ప్రమాదాలు అని ఆరోపణ
    జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి ఒకరిపై ఒకరు నెపం
    నెట్టుకుంటున్నాయని వెల్లడి
    హైదరాబాద్, సెప్టెంబర్ 12 కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని యాకుత్పురాలో తెరిచి ఉంచిన మ్యాన్ హెరాల్ లో చిన్నారి పడిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇది ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు

  • దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు

    దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు

    • గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు తీరప్రాంత ఆలయాల అభివృద్ధికి తక్షణ చర్యలు • పుష్కరాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
      హైదరాబాద్,సెప్టెంబర్12 : గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు- చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు.
    • అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీంతో పాటు పుష్కరాలు ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలన్నారు.

  • యూఏఈపై భారత్ భారీ విజయం

    యూఏఈపై భారత్ భారీ విజయం

    సియా కప్ ను తనదైన స్టైల్లో ఇండియా ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్ హెూదాలో బరిలోకి దిగిన భారత్.. బుధవారం దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో పసికూన, ఆతిథ్య యూఏఈపై 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈ భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. కేవలం 13.1 ఓవర్లలోనే 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలీషన్ షరాఫు (17 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కరర్ గా నిలిచాడు.

    చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ((4/7) బంతితో మాయ చేసి అద్భుతం చేశాడు. అనంతరం ఛేజింగ్ ను కేవలం 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి కంప్లీట్ చేసిన భారత్, 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ వికెట్ ను జునైద్ సిద్ధిఖీ తీశాడు. ఈ ఫలితంలో టోర్నీలో ఇండియా బోణీ కొట్టడంతోపాటు గ్రూప్-ఏలో తొలి విజయాన్ని సాధించింది. తర్వాత మ్యాచ్ లో భాగంగా ఈనెల
    చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో
    ఆదివారం (14న) తలపడనుంది.
    చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ,
    శుభమాన్ గిల్ (20 నాటౌట్) తుఫాన్ అరంభం అందించారు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా ‘మలిచిన అభిషేక్ తన ఉద్దేశాన్ని
    చాటాడు. ఈ మ్యాచ్ ద్వారా పొట్టి ఫార్మాట్ లో ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన గిల్ కూడా చెలరేగాడు. వీరిద్దరూ విధ్వంస సృష్టించడంతో యూఏఈ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. తొలి ఓవర్లోనే మరో బౌండరీని అభిషేక్ బాదడంలో పది పరుగులు వచ్చాయి. తర్వాత ఓవర్లో గిల్ కూడా ఒక ఫోర్, సిక్సర్ కొట్టి జోరును ప్రదర్శించాడు. అలా వీరిద్దరూ పరుగులు వేట సాగించడంతో పరుగులు చకాచకా వచ్చాయి. మూడో ఓవర్లలో అభిషేక్ మరోసారి ఒక ఫోర్, సిక్సర్ కొట్టడంలో టార్గెట్ కరుగుతూ వచ్చింది. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో అభిషేక్ ఔటవడంతో | తొలి వికెట్ కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి
    తెరపడింది… ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (7 నాటౌట్) తో కలిసి గిల్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. నిజానికి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈకి శుభారంభమే దక్కింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ ముహమ్మద్ వసీమ్ (19) తో కలిసి ఆలీషన్ తొలి వికెట్ కు 26 పరుగులు జోడించి, మంచి స్టార్ట్ ను అందించాడు. అయితే అలీ షన్ ఔటయ్యాక యూఏఈ కుదుపునకు లోనైంది. ఓ ఎండ్ లో వసీమ్ నిలబడినా, వచ్చిన ప్లేయర్ల వచ్చినట్లు వెనుదిరిగారు. ముఖ్యంగా ఒకొనొక దశలో 46/2 తో మంచి స్థితిలో నిలిచిన యూఏఈ ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది.

    కేవలం 11 పరుగుల తేడాతో మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. ముఖ్యంగా కుల్దీప్ స్పిన్ మంత్రానికి ఆతిథ్య జట్టు వద్ద సమాధానం లేకుండాపోయింది. మరో ఎండ్ లో శివమ్ దూబే కూడా మూడు వికెట్లతో రాణించాడు. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి తలో వికెట్ దక్కింది. ఈ ఫార్మాట్ లో భారత్ పై ఒక ప్రత్యర్థి నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం

  • భారీ రేటుకి ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్

    భారీ రేటుకి ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్

    నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న ‘అఖండ 2’ చిత్రం విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ విలువ రూ. 80 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

    బాలకృష్ణ కెరీర్లోనే ఒక సినిమాకు ఓటీటీ రూపంలో ఇంత భారీ మొత్తం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో వచ్చిన ‘అఖండ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘అఖండ 2’పై ప్రేక్షకులు, వ్యాపార వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్ను దృష్టిలో ఉంచుకునే నెట్ ఫ్లిక్స్ ఇంత పెద్ద మొత్తానికి హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డీల్ విషయం ఫిల్మ్

    ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, ఈ చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే, అదే రోజున పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ కూడా విడుదల కానుండటంతో, బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు ‘అఖండ 2′ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం
    అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను డిసెంబర్లో
    ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత బాలయ్య-బోయపాటి కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్