మస్తే న్యూస్ నారాయణఖేడ్ డివిజన్ రిపోర్టర్ పెద్ద శంకరంపేట : తీర మనోవేదనకు గురైన యువకుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పెద్దశంకరంపేట మండలం మూసాపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్పైప్రవీణ్ణి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోనరి మూసాపేట గ్రామానికి చెందిన బైకాని దేవయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు గంగమేశ్వర్ని టేక్మాల్ మండలం హసన్మహామ్మద్పల్లి గ్రామానికి చెందిన ఎక్కల మానసతో వివాహం చేసి ఇల్లరికం తీసుకెళ్లారు.
మూడు నెలల క్రితం గంగమేశ్వర్తో మానసకు వచ్చిన విభేదాల కారణంగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో గంగమేశ్వర్పై కేసునమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. పది రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన గంగమేశ్వర్ మూసాపేట గ్రామంలోనే తండ్రి వద్ద ఉంటున్నాడు. కేసులో నిందితునిగా ఉన్న గంగమేశ్వర్ 12.09.2025న కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. 11వ తేదిన (గురువారం) సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు.
బంధువులు అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం గ్రామ శివారులోని గోండ్లరాములు వ్యవసాయ బావి దగ్గర గంగమేశ్వర్ ఫోన్, దుస్తులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బావిలో వెతకగా అతని మృతనేహం లభించింది. జైలు కస్టడీపై ఏర్పడిన భయం కారణంగానే గంగమేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబీకులు పేర్కొన్నారు. మృతుని తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
















